శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:39 IST)

టమోటా తినండి..ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టండి.!

టమోటాను రోజూ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా పురుషుల్లో ఏర్పడే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని బ్రిటీష్ పరిశోధకులు తెలిపారు. సుమారు ఒక వారానికి ఒకటిన్నర టమోటాలను ఆహారంలో తీసుకునే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ ఏర్పడే అవకాశం 20 శాతం తక్కువని పరిశోధకులు పరిశోధనలో తేల్చారు. ప్రపంచ స్థాయిలో పురుషుల్లో అత్యధికంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
ముఖ్యంగా బ్రిటన్‌ పురుషులు ఎక్కువ మంది ప్రోస్టేట్ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది. సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించాలంటే.. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. ఇంకా కొవ్వు తక్కువగా గల మాంసం తీసుకోవచ్చు. ఉప్పును బాగా తగ్గించాలి. అలాగే టమోటాలను అధికంగా రోజు వారీ డైట్‌లో చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.