బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By JSK
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (19:24 IST)

కోరుకున్న బిడ్డ పుట్టాలంటే ఏం చేయాలి...??

మ‌హాల‌క్ష్మి లాంటి ఆడ‌పిల్ల కావాల‌ని కోరుకునేవారు కొంద‌రయితే, వంశాన్ని నిలిపే వార‌సుడుగా మ‌గ‌పిల్లవాడు కావాల‌ని కోరుకుంటారు మ‌రికొంద‌రు. కోరుకున్న బిడ్డ పుట్ట‌డానికి ప్ర‌పంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌ల

మ‌హాల‌క్ష్మి లాంటి ఆడ‌పిల్ల కావాల‌ని కోరుకునేవారు కొంద‌రయితే, వంశాన్ని నిలిపే వార‌సుడుగా మ‌గ‌పిల్లవాడు కావాల‌ని కోరుకుంటారు మ‌రికొంద‌రు. కోరుకున్న బిడ్డ పుట్ట‌డానికి ప్ర‌పంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌లో వివిధ ప‌ద్ధతులు ఆచ‌ర‌ణ‌లో ఉన్నాయి. ఆడ‌,మ‌గ లింగ భేదానికి  x,y క్రోమోజోముల క‌ల‌యికే ప్ర‌ధానం. వీటి క‌ల‌యిక కోరుకున్న విధంగా జ‌రిగేందుకు కొన్ని ర‌కాల ప‌ద్ధతుల‌ను పాటిస్తున్నారు. మెన్సెస్ అయిన మొద‌టి మూడు రోజులు వ‌ద‌లి 4, 6, 8, 12, 14 ఇలా స‌రిసంఖ్య రోజుల్లో క‌లిస్తే మ‌గ‌బిడ్డ అని 5, 7, 9, 11, 13 ఇలా బేసిసంఖ్య రోజులో క‌లిస్తే ఆడ‌బిడ్డ క‌ల‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంది.
 
ప్ర‌స్తుతం ఇది ఇలావుండ‌గా అమెరికాకు చెందిన డాక్ట‌ర్ రోనాల్డ్ ఎరిక్సన్ కొన్ని ప‌ద్ధతుల‌ను అనుస‌రించే వైద్య‌శాల‌లు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం ప్ర‌కారం 75 నుంచి 80 శాతం ఫ‌లితాలు మ‌గ‌బిడ్డ విష‌యంలోను, 65 నుంచి 75 శాతం ఆడ‌బిడ్డ విష‌యంలోను పొందుతున్న‌ట్లు తెలుస్తుంది. కాగా డాక్ట‌ర్ నాన్సీ అలెగ్జాండ‌ర్ ఒక ప‌ద్ధతిని, ఫిల‌డెల్ఫియాలో ఫెర్టిలిటీలో మ‌రొక ప‌ద్ధతిని అనుస‌రిస్తూ కోరిన బిడ్డ‌ను పొంద‌వ‌చ్చున‌ని అంటున్నారు.
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇన్ని ప‌ద్ధతులు ఆచ‌ర‌ణ‌లో ఉన్నా క‌చ్చిత‌మైన ప‌ద్ధతి అంటూ ఏమిలేదు. ఒకవేళ తాము కోరుకున్న బిడ్డ క‌ల‌ుగ‌కపోయినా ప్ర‌కృతి ధ‌ర్మంతో భ‌గ‌వ‌త్ ప్ర‌సాద‌మైన త‌మ బిడ్డను అక్కున చేర్చుకోవ‌డం అన్ని విధాల ధ‌ర్మం.