Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్‌లోకి ప్రవేశించిన ప్రమాదకర వైరస్ జికా?

ఆదివారం, 28 మే 2017 (11:54 IST)

Widgets Magazine
zika virus

ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ సిటీలోని బాపూనగర్‌ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్‌ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం నిర్ధారించింది. వైరస్‌ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. 
 
సాధారణ నిర్ధారణ పరీక్షలో భాగంగా అహ్మదాబా‌ద్‌లోని బీజే వైద్యకళాశాల ఆధ్వర్యంలో 93 రక్తనమూనాలపై ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌ జరపగా వైరస్‌ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన శాంపిళ్లపై మళ్లీ నిర్ధారణ కోసం పుణెలోని ల్యాబ్‌లో టెస్టులు చేశారు. 
 
నిర్ధారణ పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు పంపించామని, వైరస్‌ జాడను నిర్ధా రిస్తూ అక్కడి నుంచి సమాచారం వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్‌లోకి జికా వైరస్ ప్రవేశించినట్టు వైద్యులు నిర్ధారించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

'ఓ' గ్రూపు వారికి గుండెపోటు ముప్పు లేదా? సర్వే ఏం చెపుతోంది!

ప్రస్తుతం మారుతున్న జీవనపరిస్థితుల దృష్ట్యా గుండెపోటు ముప్పు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ...

news

చెర్రీ పండ్ల గురించి 5 పాయింట్లు...

చెర్రీ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటికి చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు వైద్యులు. ...

news

ఒత్తిడితో తలపట్టుకుంటున్నారా? యాలకుల టీ తాగేయండి..

ఒత్తిడితో తలపట్టుకుంటున్నారా? యాలకుల టీ తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఒత్తిడిని ...

news

బరువు తగ్గాలంటే స్కిన్ లెస్ చికెన్ తినండి..

బరువు తగ్గాలంటే.. తిండి తగ్గించాల్సిన అవసరం లేదు. పోషకాహారం తీసుకోవడం.. అది తేలికగా ...

Widgets Magazine