బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 16 నవంబరు 2014 (16:23 IST)

17న ప్రీ మెచ్యూర్ బేబీస్ డే.. ప్రీ మెచ్యూర్ బేబీస్ పుట్టుక నివారణకు అవగానే ముఖ్యం!

ప్రతి యేడాది నవంబర్ 17వ తేదీని వరల్డ్ ప్రీ మెచ్యూర్ బేబీస్ డేగా జరుపుకుంటున్నారు. అయితే, ప్రీ మెచ్యూర్ బేబీస్ నివారణకు అవగాహన ఎంతో ముఖ్యమని ప్రముఖ నియోనాటల్ స్పెషలిస్టు డాక్టర్ దీపా హరిహరన్ అంటున్నారు. ప్రీ మెచ్యూర్ బేబీస్ పుట్టుకకు గల కారణాలపై ఆమె మాట్లాడుతూ.. 9 నెలలు నిండక ముందే తల్లి గర్భం నుంచి జన్మించే పిల్లలను ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటారని, ఈ తరహా పిల్లలు భారత్‌లో యేడాదికి 3.5 మిలియన్ల మంది జన్మిస్తున్నారని చెప్పారు. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానమన్నారు. 
 
ఆహారపు అలవాట్లు, నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్, డయాబెటీస్ వంటి కారణంగా ఈ తరహా పిల్లలు జన్మిస్తారని చెప్పారు. అందువల్ల తల్లి గర్భంలో పిండం ఉత్పత్తి అయినప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణ, షుగర్ లెవల్స్ తనిఖీలు ఎంతో కీలకమన్నారు. అదేవిధంగా ప్రీ మెచ్యూర్ బేబీస్ కేసుల్లో 75 శాతం మేరకు తల్లిపాలు, సాధారణ వైద్య పరీక్షలు, ఇన్ఫెక్షన్స్ కంట్రోల్స్, కంగారూ మదర్ కేర్ వంటి చర్యల ద్వారా నివారించవచ్చన్నారు. 
 
అలాగే, డాక్టర్ ఏ రామచంద్రన్స్ డయాబెటీస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామచంద్రన్ మాట్లాడుతూ ప్రీ మెచ్యూర్ బేబీస్ పుట్టుకను నివారించాలంటే తల్లుల్లో అవగాహన ముఖ్యమన్నారు. ముఖ్యంగా ప్రెగ్సెన్సీ సమయంలో తల్లికి షుగర్ లెవెల్స్ తనిఖీలు అత్యంత కీలకమన్నారు. చక్కెర వ్యాధి రావడానికి తమ వంశంలో ఒకరికి ఉండాల్సిన అవసరం లేదని, అధిక బరువు, బానపొట్ట, ఆహారపు అలవాట్లు పాటించక పోవడం, వయస్సు, ఫాస్ట్ వంటివి కొన్ని కారణాలుగా ఉన్నాయన్నారు.