శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By CHJ
Last Modified: గురువారం, 30 జూన్ 2016 (15:17 IST)

నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ వాడితే... లావయిపోతారు....

నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ వాడితే బరువు పెరుగుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక్క స్మార్ట్‌పోన్‌ అనే కాదు.. ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ వంటి వాటిని కూడా నిద్రపోయే ముందు ఉపయోగించకూడదట. నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తుంటే ఆ స్ర్కీన

నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ వాడితే బరువు పెరుగుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక్క స్మార్ట్‌పోన్‌ అనే కాదు.. ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ వంటి వాటిని కూడా నిద్రపోయే ముందు ఉపయోగించకూడదట. నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తుంటే ఆ స్ర్కీన్‌ మీద ఉన్న ఫోటాన్ల గుంపు  మెదడుకు ‘ఇది నిద్రపోయే సమయం కాదు. అప్పుడే మెలటోనిన్‌ హార్మోన్‌ను విడుదల చేయొద్దు’ అని సందేశం పంపిస్తుందట. 
 
చీకటిలో ఉన్నప్పుడు నిద్ర వచ్చేలా చేసే హార్మోన్‌ మెలటోనిన్‌. మెదడు దీనిని విడుదల చేయకపోవడం వల్ల నిద్ర పట్టదట. ఒకవేళ నిద్ర పట్టినా అది గాఢ నిద్ర కాదట. ఈ విధంగా తక్కువగా నిద్రపోవడం వల్ల మెటబాలిజమ్‌ దెబ్బతినడంతోపాటు శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయిలు కూడా క్షణక్షణానికీ మారుతూ ఉంటాయి. అందువల్ల పగటి సమయంలో అలసిపోయినట్టుగా, నీరసంగా అనిపించడంతోపాటు ఆకలి ఎక్కువ అవుతుందట. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోవడంతోపాటు ఇన్సులిన్‌ స్థాయిలో మార్పులు రావడం ఊబకాయానికి దారి తీస్తుందని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.