బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (16:44 IST)

బాయ్ ఫ్రెండ్‌కు శీఘ్రస్ఖలన సమస్య ఉంది.. పెళ్లి చేసుకున్నా తృప్తి పరచలేడా?

నేను ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నా. ఆ కంపెనీలో పని చేసే సహ ఉద్యోగిని మనస్సు పారేసుకున్నా. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. అలా గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం.. ఇద్దరం కలిసి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని భావిస్తున్నాం. అయితే, ఇటీవల పార్టీ ఇస్తానని చెప్పి.. తన రూంకు తీసుకెళ్లాడు. ఆ రోజున మేమిద్దరం తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నాం. అంగ ప్రవేశం చేసీ చేయగానే వీర్యాన్ని స్ఖలించాడు. ఏంటని అడిగితే ఆపుకోలేక.. శీఘ్రస్ఖలనమైందని చెప్పాడు. ఇపుడు నాకో సందేహం ఉంది. పెళ్లికి ముందు మాత్రమే ఈ తరహా సమస్య ఉంటుందా.. లేక వివాహమైన తర్వాత కూడా అతనికి శీఘ్రస్ఖలనం సమస్య ఉంటుందా.. సందేహం తీర్చండి. 
 
సాధారణంగా ఈ తరహా సమస్య చాలా మంది పురుషుల్లో ఉంటుంది. ఇది వివాహమైన తర్వాత కూడా ఉంటుంది. పెళ్లయిన కొత్తలో ఈ సమస్య పెద్దగా లేక పోయినప్పటికీ.. రోజులు గడిచే కొద్ది కనిపిస్తుంటుంది. దీంతో భార్యతోనే సెక్స్‌లో పాల్గొనేందుకు అయిష్టత వ్యక్తం చేస్తుంటారు.  యితే, శీఘ్రస్ఖలనానికి చికిత్స ఉందని వైద్యులు చెపుతున్నారు. దీనికి ఆరంభంలోనే వైద్యం చేయించుకోకుంటే మరింత జఠిలమై అంగస్తంభన లోపానికి దారి తీస్తుందని చెపుతున్నారు. సెక్స్ కోరికలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. సెక్స్‌లో గ్యాప్ పెరిగినా ఈ సమస్య మరింత అధికమవుతుందని అంటున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భార్యభర్తల మధ్య మానసిక దూరం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 
 
స్త్రీలు సెక్స్ కంటే ఎక్కువగా భర్త ప్రేమకే ప్రాముఖ్యతనిస్తారు. అయితే, భార్యల సహకారంతోనే భర్తల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు అంటున్నారు. శీఘ్రస్ఖలనం తగ్గించే, అంగస్థంభన కాలాన్ని పెంచే ఎక్సర్‌సైజులు చెప్పడంతో పాటుగా పర్‌ఫ్మాన్స్ ఎంగ్జైటీ తగ్గడానికి సైకోథెరపీ, సెక్స్ ఆరోగ్యం కోసం మంచి ఆహార సూచనలు చేస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.