శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (15:27 IST)

నా భర్త భావప్రాప్తి పొందాలంటే అంగ చూషణ చేయాల్సి వస్తోంది? ఎందుకని?

నా వయస్సు 28 యేళ్లు. సంతానం లేదు. నాకు మాత్రం దాంపత్య జీవితం సంతృప్తిగానే ఉంది. సెక్స్‌లో పాల్గొన్నపుడు భావప్రాప్తి పొందుతున్నా. అయితే, నా భర్త మాత్రం భావప్రాప్తి పొందలేక పోతున్నాడు. దీంతో నేను భావప్రాప్తి పొందిన తర్వాత ఆయనను సంతృప్తి పరిచేందుకు వేరే విధంగా చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా అంగచూషణ, హస్త ప్రయోగం చేయమని ఒత్తిడి చేస్తున్నారు. మేమిద్దరం శృంగారంలో బాగానే తృప్తి పొందుతున్నా... ఆయన మాత్రం ఎందుకని భావప్రాప్తి పొందలేక పోతున్నారో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి. 
 
ఇక్కడో విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీ కంటే.. మీవారిలో రతివాంఛ అధికంగా ఉంది. అందువల్లే సెక్స్‌లో పాల్గొన్నపుడు ఆయన త్వరగా భావప్రాప్తి పొందలేక పోతున్నారు. ఈ లోపు మీరు భావప్రాప్తి పొందడం వల్ల ఆయనను అసంతృప్తికి లోనవుతున్నారు. అందువల్ల పడక గదిలో అంగ ప్రవేశం జరిపేందుకు ముందుగా ఫోర్‌ప్లేకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత సంభోగ సమయంలో ఆయనకు సహకరించండి. ఇలా చేయడం వల్లే మీతో పాటు భావప్రాప్తి పొందే అవకాశం ఉంది.