బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : శనివారం, 6 సెప్టెంబరు 2014 (19:03 IST)

సెక్సువల్ స్టామినాకు నేచురల్ వయాగ్రా బీట్‌రూట్!

సెక్సువల్ స్టామినాకు నేచురల్ వయాగ్రా బీట్‌రూట్ అనేది తెలుసా.. అయితే చదవండి. బీట్‌రూట్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందట. నైట్రేట్స్ పుష్కలంగా కలిగిన ఈ బీట్‌రూట్‌ను తీసుకోవడం ద్వారా నైట్రిక్ యాసిడ్‌ను శరీరంలోకి విడుదల చేస్తుంది. తద్వారా సెక్సువల్ స్టామినా పెరుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
 
ఇంకా గర్భం ధరించిన మహిళలకు బీట్‌రూట్ ఎంతగానో మేలు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌ను గర్భిణీలు రోజూ తీసుకోవడం ద్వారా శిశువు వెన్నెముక, ఎముకలు బలపడతాయి. ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. గర్భిణీలకు తగిన ఎనర్జీని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.