శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (16:41 IST)

ప్రసవించాక బాగా పొట్ట వచ్చింది.. ఆయన అనాసక్తి చూపుతున్నారు... తగ్గే మార్గమేంటి?

మాది విజయవాడ. నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ళ బాబు ఉన్నాడు. అయితే, నాకు ప్రసవించాక బాగా పొట్ట వచ్చింది. పెద్దాపరేషన్ చేసిన బిడ్డను బయటకు తీశారు. ప్రసవించి రెండేళ్లు అయినా పొట్ట మాత్రం డెలివరీకి ముందు ఎలా ఉందో ఇపుడు కూడా అలానే ఉంది. ఆపరేషన్ తర్వాత నడుముకు బెల్టు వేసుకోమని వైద్యురాలు సలహా ఇచ్చారు. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడేమో పొట్ట పెద్దదిగా ఉంది. దీంతో ఆయన శృంగారం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పొట్ట తగ్గే మార్గమేంటి.?
 
సాధారణంగా డెలివరీ తర్వాత చాలా మంది మహిళలకు పొట్ట వస్తుంది. దీన్ని తగ్గించుకునేందుకు నానా రకాల వ్యాయామాలు చేస్తూ పథ్యాలు (ఆహార నియమాలు పాటించడం) ఉంటుంటారు. అలాగే, పొట్టకు బెల్టులు ధరించడం, కట్టు కట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
 
నిజానికి డెలివరీ తర్వాత పొట్ట రావడానికి ప్రధాన కారణం హార్మోన్లు. ప్రెగ్నెన్సీ వచ్చినపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల డెలివరీకి ముందు.. తర్వాత తగిన వ్యాయామాలు చేయక పోవడం వల్ల పొట్ట వస్తుంది. డెలివరీకి ముందు.. డెలివరీ తర్వాత వైద్యుడు చెప్పినట్టుగా వ్యాయామాలు చేస్తూ.. చిన్నపాటి జాగ్రత్తలు పాటించినట్టయితే దీన్ని నివారించవచ్చు.