శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2014 (15:15 IST)

మీ భాగస్వామితో కలిసి నిద్రపోతున్నారా? హార్ట్‌కు ఎంతో మంచిదట!

ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే రోజుకు 8 గంటల పాటు నిద్రపోండి. అయితే బెడ్ మీదకు పోతే, త్వరగా నిద్రపట్టట్లేదా? ఇందుకు ఒత్తిడి, ఆందోళన కారణం. అలాంటి సమయంలో మీ భాగస్వామితో కలిసి నిద్రపోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
దంపతులు కలిసి నిద్రించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని వారు సూచిస్తున్నారు. ఒంటరిగా పడుకొన్నప్పుడు, మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇతర ఆలోచనలు, పనులతో మీ మెదడుకు పూర్తిగా పనిపెడుతారు. అదే జంటగా నిద్రించినట్లైతే మీకు త్వరగా నిద్రపడుతుంది. ఇతర విషయాల గురించి ఆలోచించే అవసరం ఉండదు. తోడు ఉన్నప్పుడు త్వరగా నిద్రపట్టడం సహజం. దాంతో శారీరకంగా, మానసికంగా తగినంత విశ్రాంతి పొందుతారు.
 
గాఢంగా నిద్రపోవడం, సరిపడనంత సమయం (కనీసం 8గంటలు)నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా అవసరం. దాని వల్ల మీ గుండెకు ఎంటువంటి స్ట్రెయిన్ ఉండదు. అందువల్లే, కప్పులు కలిసి నిద్రించడం వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుంది.
 
భాగస్వామితో కలిసి నిద్రించడం ద్వారా  ప్రతిరోజూ త్వరగా నిద్రలేవగలుగుతారు. అంతే కాదు, ఆరోజంతా మీరు చాలా ఎనర్జిటిక్‌గా కనబడుతుంటారు.
 
కేవలం కొత్తగా పెళ్ళైవారు మాత్రమే జంటగా హాపీగా నిద్రపోతారు అనుకోవడం పొరపాటే, కప్పుల్స్ వయస్సుతో నిమిత్తం లేకుండా, జంటగా నిద్రించడం వల్ల కపుల్స్ ఇద్దరీకి చాలా ఆరోగ్యకరం. ఇంతా ఎమోషనల్‌గా కూడా దగ్గరవుతారు. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుని మరింత సన్నిహితులౌతారని ఆరోగ్య నిపుణు అంటున్నారు.