శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (18:34 IST)

పురుషుల్లో సెక్స్ డ్రైవ్‌కు సహాయపడే ఫుడ్స్ ఏంటంటే?

పురుషుల్లో సెక్స్‌డ్రైవ్‌ను పెంచే ఆహారాల్లో మటన్ ఒకటి. మటన్‌లో జింక్ సమృద్దిగా ఉంటుంది. మటన్‌తో తయారు చేసిన అనేక వంటకాలు సెక్స్ డ్రైవ్‌కు సహాయపడతాయి. అలాగే చేపలో ముఖ్యంగా, ఒమేగా -3 ఉండుట వలన సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే చేప నూనె సప్లిమెంట్ కూడా బాగా పనిచేస్తుంది. పురుషుల్లో లైంగిక అరోగ్యాన్ని పెంచే ఆహారాల్లో చాక్లెట్ కూడా ఉంది. చాక్లెట్‌లోని బ్రోమైన్ లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.
 
అలాగే కూరగాయాల్లో చిలకడదుంప బెస్ట్ సెక్స్ డ్రైవ్‌ను పెంచే ఆహారంగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని బీటా-కెరోటిన్, విటమిన్ ఎ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.  ఆరోగ్యకరమైన సెక్స్ జీవితం కోసం అధిక కొవ్వు కలిగిన హోల్ మిల్క్, మీగడ, వెన్న తీసుకోండి. నిద్రించే ముందు ఒక కప్పు వెచ్చని పాలు తీసుకోవాలి. 
 
అలాగే పురుషులు తీసుకునే ఆహారంలో కోడిగుడ్లు ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో గుడ్లను చేర్చితే విటమిన్ B5 మరియు B6 సమృద్ధిగా అందుతుంది. గుడ్లలో ప్రోటీన్ మరియు విటమిన్లు సమృద్దిగా ఉండుటవలన పురుషుల్లో లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇక అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ B సమృద్దిగా ఉండుట వలన పురుషుల్లో లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.