శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (12:24 IST)

సెక్స్ పగటి పూట చేస్తే ఏమవుతుంది.. రాత్రి వేళల్లోనే ఎందుకు చేయాలి?

వాత్సాయన మహర్షితో పాటు శృంగార నిపుణులు కూడా భార్యాభర్తలు లేదా స్త్రీపురుషులు తమ ఏకాంత జీవితాన్ని (సెక్స్) కేవలం రాత్రి పూట మాత్రమే జరుపుకోవాలని, పగటిపూట ఏమాత్రం అనువైన వేళ కాదని చెపుతుంటారు. ఇలాఎందుకు చెపుతారు. అసలు సెక్స్ ఏ ఏ సమయాల్లో చేయాలి. సలహా ఇవ్వండి. 
 
సాధారణంగా పెళ్లయిన కొత్త జంటలకు సమయం సందర్భమంటూ ఉండదు. వీలు చిక్కినపుడల్లా శారీరక సంబంధాన్ని కొనసాగిస్తారు. దీంతో రోజుకు ఐదారుసార్లు కూడా వారు సెక్స్‌లో పాల్గొంటుంటారు. అయితే, సెక్స్ నిపుణుల సూచన మేరకు రోజుకు ఒక్కసారే సెక్సు చేయటం, అదీ ఒక రోజు గ్యాప్ తీసుకొని చేయటం మంచిదని వారు అంటున్నారు. అలాగే పగటి పూట రతిక్రియకు కాస్త దూరంగా ఉండటమే మేలంటున్నారు. సంభోగానికి రాత్రి పూట మాత్రమే అనువైన సమయంగా పేర్కొంటున్నారు.  
 
అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలని వారు సూచన చేస్తున్నారు. ఇకపోతే.. రాత్రి భోజనం చేసిన వెంటనే రతి క్రీడకు ఉపక్రమించరాదట. కనీసం రెండు గంటల పాటు గ్యాప్ ఇచ్చి ఆ పని చేయాలని వారు చెపుతున్నారు. 
 
సెక్స్‌కు పగటి పూట కంటే రాత్రి వేళ ఉత్తమైన సమయంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. భార్యాభర్తలు రతి కార్యంలో నిమగ్నమైవున్న సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదు. ఒక సారి సెక్స్‌కు ఉపక్రమిస్తే అది నిర్విఘ్నంగా పూర్తి చేయాలి. అపుడే భార్యాభర్తలిద్దరూ పూర్తి సంతృప్తిని పొందుతారు. పగటిపూట ఏదో ఒకవిధంగా ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. అదే రాత్రి వేళల్లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. అందుకే రాత్రి వేళలు సెక్స్‌కు ఎంతో అనుకూలమని నిపుణులు చెపుతున్నారు.