గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 3 డిశెంబరు 2014 (15:59 IST)

బీఎఫ్‌లో చూస్తూ సెక్స్‌లో పాల్గొంటాం.. కానీ అందులో చేసినట్టుగా చేయలేడు ఎందుకని?

మాకు వివాహమై 15 యేళ్లు అయింది. మా ఇద్దరు పిల్లలు హాస్టల్స్‌లో చదువుకుంటున్నారు. నాకూ.. మా వారికి సెక్స్ కోర్కెలు ఎక్కువ కావడంతో తమకు ఏకాంతానికి అడ్డుగా ఉంటారని భావించి హాస్టల్స్‌లో చేర్చించాం. దీంతో మేమిద్దరమే ఇంట్లో ఉండటం వల్ల శృంగారంలో హద్దులు దాటిపోతున్నాం. ఇటీవల బీఎఫ్ చేస్తూ సెక్స్‌లో పాల్గొనాలని కోర్కె కలగడంతో అదేవిధంగా చేశాం. ఆ తర్వాత పలుమార్లు నీలి చిత్రాలు చూస్తూ సంభోగించుకున్నాం. కానీ, ఆ చిత్రాల్లో చేసినట్టు మా వారు శృంగారంలో పాల్గొనలేక పోతున్నారు. పైగా.. అంగం సైజు కూడా చాలా చిన్నదిగా ఉంది. నీలి చిత్రాల్లో కనిపించే పురుషులకుండే సైజు తరహాలో మా వారి అంగం పెరగాలంటే ఏం చేయాలి. సలహా ఇవ్వండి.? 
 
అందుకే స్త్రీపురుషులు నీలి చిత్రాలు చూడరాదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తుంటారు. మూరెడంత అంగాలు ఎక్కడా ఉండవు. పశువులకు తప్ప. నీలి చిత్రాల్లో కెమెరా ట్రిక్స్ కారణంగా అంగాలు చాలా పొడవుగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. అలాగే, గంటల కొద్దీ రతి చేయడం కూడా అసాధ్యం. ఇలాంటి చిత్రాలు చూసి భర్తలను చాలా మంది భార్యలు శంకిస్తూ తమ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టుకునే సంఘటనలు అనేకం ఉన్నాయి. 
 
ఇకపోతే శృంగారంలో సంతృప్తి కలగాలంటే పూర్తి పడక గదికి చేరిన వెంటనే యోనిలో అంగం ప్రవేశం చేయొద్దని మీ భర్తకు చెప్పండి. పడక గదికి చేరిన తర్వాత ముందుగా ఉపరతి చేయమని చెప్పండి. ముద్దులతో భుజాలను, స్తనాలను నిమురుతూ, హగ్గింగ్‌ల ద్వారా శరీరంలోని అని ప్రాంతాలను స్పర్శించమని చెప్పండి. అలాగే, యోనిపై చేయి వేసి.. క్లిటారిస్‌ను ప్రేరేపించమని చెప్పండి. అలా చేస్తున్నప్పుడు.. ఇక ఆగలేం అనుకున్న సమయంలో అంగాన్ని యోనిలోకి జొప్పించి సెక్స్ చేసుకోవడం వల్ల పూర్తి సంతృప్తిని పొందవచ్చు. అంతేకానీ, నీలి చిత్రాల్లో చూపించినట్టుగా నిజజీవితంలో చేయడం అసాధ్యమనే విషయాన్ని గుర్తించండి.