గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:55 IST)

నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయనీ మొక్కుబడిగా పూర్తి చేస్తున్నాడు.. ఏం చేయాలి?

నాకు ఇటీవలే వివాహమైంది. ఇద్దరం ఉద్యోగస్తులమే. పూణెలో నివశిస్తున్నాం. అయితే, చిన్నప్పటి నుంచి నా వక్షోజాలు చిన్నవిగా ఉంటాయి. వివాహమైన తర్వాత నా భర్య నెల రోజుల పాటు బాగానే సెక్స్‌‌లో పాల్గొన్నాడు. గత కొన్ని రోజులుగా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయంటూ ఏదో మొక్కుబడిగా, తూతూమంత్రంగా సెక్స్ పూర్తి చేస్తున్నాడు. దీంతో ఆయనకూ నాకూ సంతృప్తి కలగడం లేదు. వక్షోజాలు పెద్దవి అయ్యేందుకు మార్గమేంటి. ఆయనను తృప్తి పరచాలంటే ఏం చేయాలి. సలహా ఇవ్వండి. 
 
సాధారణంగా చాలా మంది యువతులకు హార్మోన్ల ప్రభావం కారణంగా వక్షోజాలు చిన్నవిగా ఉంటాయి. మరికొందరికి భారీ సైజుల్లో ఉంటాయి. చిన్న వక్షోజాలు ఉన్నవారికీ.. భారీ వక్షోజాలు ఉన్నవారికీ సెక్స్ స్పందనల్లో తేడాలు ఉండవు. కానీ, పడక గదిలో భార్యాభర్తలు నడుకునే తీరును బట్టి వారిలో స్పందనలు కలుగుతుంటాయనే విషయాన్ని గ్రహించాలి. దాంపత్య జీవితంలో కేవలం వక్షోజాలతోనే పని కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అందువల్ల లేనివాటి గురించి సంసారాన్ని పాడు చేసుకోవడం కంటే.. ఉన్నవాటితో శృంగారాన్ని ఎంజాయ్ చేయండి. ఈ విషయాన్ని మీ భర్తకు విడమరిచి చెప్పండి. అన్నీ సర్దుకుంటాయి.