శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (14:41 IST)

వయాగ్రా శృంగారం కోసమే కాదు.. డయాబెటీస్ నిరోధకాలుగా కూడా..

సాధారణంగా వయాగ్రా అంటే శృంగార భావనలను ప్రేరేపించే ఉత్ప్రేరకంగా మాత్రమే ప్రతి ఒక్కరికీ తెలుసు. అంటే శృంగార భావనలను ప్రేరేపించి అంగానికి రక్తసరఫరా పెంచి... అంగం గట్టిపడేందుకు దోహదపడుతుంది. అయితే, ఇది డయాబెటిస్ నిరోధకాలుగా కూడా పని చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. 
 
సాధారణంగా రక్తంలోని చక్కెర స్థాయిని బట్టి డయాబెటీస్‌ను నిర్ధారిస్తారు. రక్తంలోని చక్కెర స్థాయిలు పరగడుపున 90 ఎమ్‌జీ, భోజనం తర్వాత 180 ఎమ్‌జీ దాటితే డయాబెటిస్‌గా నిర్ధారిస్తారు. అయితే డయాబెటిస్‌ కంటే ముందు దశను ప్రీ డయాబెటిస్‌ అంటారు. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉండగానే ఈ వయాగ్ర మాత్రలను వాడితే డయాబెటిస్‌ రాకను నిరోధిస్తాయట. 
 
సిల్డెనఫిల్‌ అనే వయాగ్ర మాత్ర ఇన్సులిన్‌ నిరోధకతను అడ్డుకోవడం ద్వారా ఇది టైప్‌-2 డయాబెటిస్‌ను అడ్డుకుంటుందట. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉన్న 51 మందికి ఈ మందును మూడు నెలలపాటు ఇచ్చి పరీక్షించగా వారి రక్తంలో చక్కెర స్థాయులు నార్మల్‌గానే ఉన్నట్టు తేలిందట. దీనిపై మరింత లోతుగా పరిశోధించి త్వరలోనే మరిన్ని వివరాలు బయటపెడతామని యూఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ పరిశోధకుడు డాక్టర్‌ నాన్సీ బ్రౌన్‌ అంటున్నారు.