గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (17:50 IST)

నా భార్యకు శుభ్రత ఎక్కువ.. నాకు అక్కడ హెయిర్ ఉంటేగానీ మూడ్ రాదు.. ఏం చేయాలి?

నాకు వివాహమై నాలుగేళ్లు అయింది. పిల్లలు లేరు. నా భార్య సంప్రదాయమైన కుటుంబానికి చెందిన మహిళ. దీంతో ఆమెకు శుభ్రత ఎక్కువ. దీంతో రోజుకు మూడుసార్లు స్నానం చేస్తుంది. యోని భాగాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచుకుంటుంది. ప్రతిరోజూ షేవ్ చేస్తుంది. కానీ నాకు అక్కడ హెయిర్ ఉంటేగానీ మూడ్ రాదు. ఏం చేయాలి? 
 
పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో ఆమెను తప్పుపట్టడానికి వీలులేదు. శృంగారంలో పాల్గొన్న తర్వాత మర్మావయవాలను శుభ్రం చేసుకోవడం చేసుకోకపోవడం అనేది స్త్రీపురుషులపై ఆధారపడివుంటుంది. సాధారణంగా సంభోగంలో పాల్గొనే దంపతులకు మర్మావయవాల్లో స్రవించే ద్రవాలతో తడి ఉంటుంది. పురుషుడు స్ఖలించే వీర్యంతో యోని మరింత తడి, జిగటగా ఉంటుంది. అందువల్ల స్త్రీలు సెక్స్ పూర్తయిన వెంటనే శుభ్రం చేసుకుంటారు. మరికొంతమంది పొడి వస్త్రంతో మర్మావయవాలను శుభ్రం చేసుకుంటారు. అయితే, సంతానం కావాలని కోరుకునే స్త్రీలు మాత్రం సెక్స్ అయిన వెంటనే పైకి లేవడం లేదా నీటితో శుభ్రం చేసుకోవడం వంటివి చేయరాదు.