శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (19:10 IST)

ప్రమోషన్ల కోసం బాస్‌తో డేటింగ్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తోంది.. ఏం చేయాలి?

నాకు కాలేజీ రోజుల్లో ఓ మంచి స్నేహితురాలు ఉండేది. మేమిద్దరం ప్రేమికులు కాకపోయినప్పటికీ.. అన్ని విషయాలపై చర్చించుకునేవాళ్లం. పైగా సైన్స్ విద్యార్థులం కావడంతో మా మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. డిగ్రీ పూర్తయిన తర్వాత మేం వేర్వేరుగా విడిపోయాం. ఆ తర్వాత ఆమె ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. యాదృచ్ఛికంగా ఆ కంపెనీలోనే నాకు కూడా ఉద్యోగం వచ్చింది. ఒక రోజున క్యాంటీన్‌లో భోజనం చేస్తుంటే ఆమె తారసపడటంతో ఆశ్చర్యపోయా. ఆ తర్వాత వివరాలు ఆరా తీశాను. నాకంటే పై స్థాయిలోనే ఉన్నట్టు చెప్పింది. అలా కొన్ని నెలల తర్వాత ఒక రోజున ఆమె క్యాబిన్‌కు ఏదో పని మీద వెళితే.. అక్కడ మా బాస్‌తో శృంగారంలో పాల్గొనివుంది. వెంటనే అక్కడ ఉండకుండా నా రూంకు వెళ్ళిపోయా. ఆ తర్వాత వారం పది రోజుల పాటు మేమిద్దరం ఒకరినొకరు చూసుకోలేదు. ఒక రోజు సాయంత్రం వేళలో ఆమే ఏదో పని నిమిత్తం నా క్యాబిన్‌కు వచ్చింది. నేను గుంభనంగా ఉండటంతో ఆమె మాటలు కలిపింది. పైగా నాకంటే పై పోస్టులో ఉండటంతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మాటల సందర్భంలో తను ఆ రోజున బాస్‌తో ఎందుకు అలా ఉందో వివరించింది. ప్రమోషన్లుతో పాటు మంచి ఇంక్రిమెంట్లు కావాలంటే కార్పొరేట్ కంపెనీల్లో అలా నడుచుకోవాల్సి ఉంటుంది లేనిపక్షంలో కష్టమని చెప్పింది. పైగా బాస్ చాలా మంచోడని కితాబిచ్చింది. ఈ మాటలు నన్ను షాక్‌కు గురి చేశాయి. ఆమెలో ఈ విధమైన మార్పునకు గల కారణాలేంటి. ఆమెను మళ్లీ నా పాత స్నేహితురాలిగా చూడటమెలా? 
 
ఆమె డిగ్రీ చదివే రోజుల్లో మీకు స్నేహితురాలు. ప్రస్తుతం ఆమె ఉద్యోగిని. ఆమె హోదా.. స్థాయి.. మీ కంటే ఎక్కువ. పైగా.. ఆమెకు వ్యక్తిగతం కంటే.. ఉద్యోగం, హోదా, జీతభత్యాల గురించే ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్టున్నారు. అలాంటి వ్యక్తిని మార్చేందుకు ప్రయత్నించాలని భావించడం మూర్ఖత్వంతో కూడుకున్న పని. ఆమె ఇలాంటిదని తెలిసిన తర్వాత అలాంటి స్థలంలో పని చేయడం ఇష్టం లేకుంటే వేరే ఉద్యోగాన్ని వెతుక్కోండి. పైగా మీకంటే ఆమె పై స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకుని నడుచుకుంటే మీకే మంచిది. ఇవేమీ పట్టించుకోకుండా ఆమెలో మార్పు తీసుకుని రావాలని ప్రయత్నించడం మీ వృధా ప్రయాస అవుతుంది.