శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:16 IST)

నా భర్తకు కోర్కెలెక్కువ.. పిల్లలున్నా నుడుముపై చేయి వేసి నొక్కుతున్నారు.. ఏం చేయాలి?

నాకు వివాహమై పదేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నా భర్తకు కోర్కెలెక్కువ. పొద్దస్తమానం సెక్స్ చేయాలని ఆరాటపడుతుంటారు. దీంతో రాత్రి పూట మాత్రమే కాకుండా ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు కూడా సెక్స్ చేసి వెళ్తుంటారు. అయితే, ఉదయం పూట పిల్లలు స్కూలుకు వెళ్లక ముందే ఆయన ఆఫీసుకు వెళ్తారు. దీంతో ఆయనతో పడక గదిలో గడపలేక.. పిల్లలను రెడీ చేయలేక చచ్చిపోతున్నా. ఎంత చెప్పినా వినిపించుకోరు. పిల్లలు చూస్తున్నా నడుంపై చేయి వేసి నొక్కుతూ ఉంటారు. ఏం చేయాలి. మా వారికి ఎలా చెప్పాలి. సలహా ఇవ్వండి. 
 
సాధారణంగా సంభోగానికి రాత్రి పూట మాత్రమే అనువైన సమయంగా నిపుణులు చెపుతారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోతోంది. అయితే, సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉండే దంపతులు మాత్రం సమయం చిక్కినపుడల్లా రతి సుఖాన్ని అనుభవిస్తుంటారు. ఇలా చేసుకోవడం మంచిదే అయినప్పటికీ.. ఇంటి వాతావరణం, పిలల్లు, కుటుంబ సభ్యులను గమనిస్తుండాలి. 
 
రాత్రి సమయంలో మీరు ఎదుర్కొనే పరిస్థితిని మీ వారికి వివరించండి. పిల్లలు చూస్తున్నారనే విషయాన్ని తేటతెల్లం చేయండి. తల్లిదండ్రులు ఇంట్లో నడుచుకునే విధానం, ప్రవర్తన పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని విడమరచి చెప్పండి. అప్పటికీ అర్థం చేసుకోక పోతే కౌన్సెలింగ్ ఇప్పించండి.