శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (12:51 IST)

ఆయనకు షుగర్ వ్యాధి ఉంది... ఇక ఏమీ చేయలేరని నా స్నేహితురాలంటోంది... నిజమా...?!!

నా భర్తకు మధుమేహం ఉంది. ఐతే ఇది ఆయనకు పెళ్లి కాకమునుపు నుంచే ఉన్నది. పెళ్లయిన కొత్తలో వారానికి నాలుగుసార్లు సెక్స్ చేసేవారు. ఇపుడు వారనికి ఒక్కసారికి మించి చేయడంలేదు. నాకేమో కోర్కెలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈమధ్య నా స్నేహితురాలితో సంభాషించినప్పుడు షుగర్ వ్యాధి వస్తే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పింది. అప్పటినుంచి నా భర్తపై నాకు అనుమానం కలుగుతోంది. షుగర్ వ్యాధి కారణంగానే ఆయన నాతో సరిగా సెక్స్ చేయలేకపోతున్నారేమోననిపిస్తోంది. నిజంగా ఆ వ్యాధి వస్తే అందుకు పనికిరారా...?
 
మీ స్నేహితురాలి అభిప్రాయం తప్పు. షుగర్ వ్యాధి ఉన్నంత మాత్రాన సెక్స్ చేయలేకపోవడం అనేది ఉండదు. ప్రస్తుతం ఆధునిక జీవిన విధానం మారిపోయింది. తీవ్రమైన వత్తిడి, పనిగంటలు ఎక్కువ, ఆహారపుటలవాట్లలో మార్పులు, జీవనశైలిపై తీవ్రప్రభావం చూపడం వల్ల పలు రకాల వ్యాధుల బారినపడుతున్నారు స్త్రీ,పురుషులు. ఇకపోతే ఇప్పుడు చాలా మందిలో డయాబెటీస్ (షుగర్) వ్యాధి కనబడుతూ ఉంది. ఈ వ్యాధితో బాధపడే చాలా మంది పురుషుల్లో 40 యేళ్లు పైబడితే సెక్స్ స్పందనలు తగ్గిపోతుంటాయనీ, నాడీ స్పందనలు తగ్గుతాయని కొన్ని వాదనలున్నాయి. ఐతే డయాబెటిస్, ఆస్థమా, రక్తపోటు వంటి వ్యాధులకు వాడే కొన్ని మందుల వల్ల కొన్నిసార్లు అంగస్తంభన సమస్య ఏర్పడుతుందని అంటారు. 
 
ఐతే చాలాసార్లు వ్యాధి, వ్యాధి నివారణకు వాడే మందుల కంటే కూడా భయం, మానసిక ఒత్తిడి వల్ల సాధారణ శృంగార స్పందనలు తగ్గిపోతాయని వైద్యులు చెపుతుంటారు. అందువల్ల ఇలాంటి సమస్యతో బాధపడే వారు.. ఒత్తిడికి దూరంగా ఉండటమే కాకుండా, యోగా, ధ్యానం, నడకతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, పాజిటివ్ ఆలోచనా ధోరణితో ముందుకు సాగితే దాంపత్య జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించగలుగుతారు.