శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (17:30 IST)

అత్తారింటికీ గెస్ట్‌గా ఓకే కానీ.. అక్కడే ఉండటం అంటే వామ్మో వద్దు!

అత్తారింటికీ గెస్ట్‌గా ఓకే కానీ.. అక్కడే ఉండటం అంటే వామ్మో అస్సలొద్దు అంటున్నారు.. నేటి తరం యువకులు. ఆది కాలం నుంచి అత్తారింటిలో అల్లుడుంటే మర్యాద ఉండదని పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని తాజా సర్వేలో కూడా వాస్తవమని తేల్చారు. ఇక్కడొక విషయం ఏమిటంటే.. తాజా సర్వేలో పెళ్లయ్యాక భర్తతో కలిసి ఇంటికి వెళ్లడానికి చాలామంది అమ్మాయిలు ఇష్టపడట్లేదట. 
 
అలాగని భర్తను ఇల్లరికం తెచ్చుకోవాలని వారు అనుకోవడం లేదు. భార్య, భర్త కలసి ఒక ఇంటిలో సెటిలవ్వాలనేది ఈ యువతుల ఆకాంక్ష. దాదాపు 52 శాతం మంది యువతులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత కొత్త ఇల్లు తీసుకుని అందులో ఉండాలన్నదే వీరి కోరిక. అలాగే ఇల్లరికం వెళ్లేందుకు యువకులు ఏమాత్రం ఇష్టపడట్లేదని తాజా సర్వే తేల్చింది.