బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (17:48 IST)

పిల్లలు పుట్టాలంటే స్త్రీ పురుషులిద్దరూ ఒకేసారి భావప్రాప్తి పొందాలనే నిబంధన ఉందా?

సాధారణంగా పిల్లలు పుట్టాలంటే స్త్రీపురుషులిద్దరూ ఒకేసారి భావప్రాప్తి చెందాలనే అపోహ చాలామంది జంటల్లో ఉంది. వాస్తవానికి ఇది తప్పు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భావప్రాప్తి అనేది శృంగారంలో పాల్గొనే జంటల మానసిక స్థితి, ఉత్సాహంపై ఆధారపడి ఉంటుందని వారు చెపుతున్నారు.
 
అయితే, పిల్లల పుట్టుకకు, భావప్రాప్తికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. పిల్లలు పుట్టాలంటే స్త్రీ పురుషులిద్దరిలో ఆరోగ్యవంతమైన ప్రత్యుత్పత్తి అవయవ నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తిలో లోపాలు లేకుండా ఉండాలని చెపుతున్నారు. అలాగే, సక్రమంగా అండం విడుదల, వీర్యకణాల సరైన ఉత్పత్తి, సంఖ్య, చలనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటున్నారు. స్త్రీలో అండం విడుదల సమయంలో కలయిక జరగడం. ఆ కలయిక కొన్ని సూచనలు పాటిస్తూ జరగడం, మానసిక శాంతి, పౌష్టికాహారం ఇవీ ముఖ్యం. భావప్రాప్తి అన్నది శృంగారానుభూతి మాత్రమే. ఇది మనోదేహాల శృంగార ప్రతిస్పందన మాత్రమే.
 
అలాగే, భార్యాభర్తలకి ఒకేసారి భావప్రాప్తి కలగడం అసాధ్యం. స్త్రీ పురుషుల శృంగార వ్యక్తీకరణలు, ప్రతిస్పందనలు మానసిక, శారీరక స్థితుల్లో భిన్నత్వం మూలంగా ఇద్దరికి భావప్రాప్తి వేర్వేరు సమయాల్లో జరుగుతుంది. భర్తకంటే ముందే భార్యకు భావప్రాప్తి కలగడం ముఖ్యం. భర్తకి వీర్యస్ఖలన సమయంలో మాత్రమే భావప్రాప్తి కలుగుతుంది. భార్యకు అలా కాదు. పురుషుల వీర్యస్ఖలనం కంటే ముందే ఎఫ్‌పీటీ ప్రక్రియ ద్వారా మాత్రమే 75 శాతం స్త్రీలలో భావప్రాప్తి కలిగితే కలయిక సమయాల్లో మిగతా 35 శాతం స్త్రీలకు భావప్రాప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు.