మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (17:05 IST)

నాలుగేళ్ళ తర్వాత నా మాజీ ప్రియురాలు మళ్లీ సుఖపెట్టమంటోంది.. ఏం చేయాలి?

నాకు వివాహమై భార్య, పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా సౌదీలో ఉంటున్నా. నా ఫ్యామిలీ మాత్రం భారత్‌లోనే ఉంది. వివాహానికి ముందే నాకు ఓ గర్ల్‌ఫ్రెండ్‌ ఉండేది. దీంతో కొన్ని నెలల పాటు శారీరక సంబంధం కొనసాగించాం. ఆ సమయంలో ఆమె ఎంతో సంతృప్తిగా ఫీలయ్యేది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల మేమిద్దరం వివాహం చేసుకోలేక పోయాం. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు లేవు. అయితే, ఇటీవల ఆమె నాకు ఈమెయిల్ పంపించి.. నా గురించి వాకబు చేసింది. ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడంతో తరచుగా మాట్లాడుకుంటున్నాం. ఆమెకు ఒక కుమార్తె ఉన్నట్టు.. ఆమె కూడా విదేశాల్లోనే నివశిస్తున్నట్టు చెప్పింది. 
 
ఇపుడు సమస్య ఏంటంటే.. తనకు మళ్లీ పాతరోజులు జ్ఞప్తికి తెచ్చేలా ఒక్కసారి సుఖపెట్టమని కోరుతోంది. దీంతో నాలోనూ ఆశ కలిగింది. ఎందుకంటే భార్యకు దూరంగా ఉండటం వల్ల నా మాజీ ప్రియురాలిని కలిసి.. ఆమె కోర్కెతో పాటు నా కోర్కెను తీర్చుకోవచ్చన్న స్వలాభంతో మనస్సు ఉవ్విళ్లూరుతోంది. అయితే, తమ పథకం ప్రకారం ఆమెను కలుసుకుంటే.. నా భార్య పరిస్థితి ఏంటి? ఆమెకు అన్యాయం చేసినట్టు అవుతాననే ఫీలింగ్ కలుగుతోంది. పైగా.. నేనేంటే నా భార్యకు ప్రాణం. అమితమైన ఇష్టం. నాకు కూడా అంతే. కానీ ఆర్థిక కారణాల రీత్యా ఆమెను దూరంగా ఉంచి నేను మరో దేశంలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇపుడు నా మాజీ ప్రియురాలి పిలుపు మేరకు వెళ్లి ఆమెను కలిసి తృప్తిపరచవచ్చా? ఆమె నుంచి నేను కేవలం శృంగార తృప్తిని మాత్రమే కోరుకుంటున్నా. ఏం చేయాలి? 
 
భార్యాభర్తలిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అని చెపుతున్నారు. అలాంటి భార్యను.. నాలుగేళ్ళ క్రితం వదిలివేసి వెళ్లిన ఓ మాజీ ప్రియురాలి పిలుపుతో మోసం చేయాలని చూడటం భావ్యం కాదు. దీనికి కారణం భార్యకు దూరంగా ఉండటం వల్లే అలాంటి ఆలోచన మీకు వచ్చింది. ఇదే ఆలోచన.. మీ భార్యకు వస్తే మీరు సహిస్తారా? మీ భార్యను నిజంగా ప్రేమిస్తే మాజీ ప్రియురాలిని మరచిపోండి. ఒకవేళ మీలో స్వార్థం ఉన్నట్టయితే భార్యకు ద్రోహం చేసి ప్రియురాలి కోర్కెను తీర్చండి. వీరిద్దరిలో ఎవరు ఆప్తులో మీరే గ్రహించుకుని ఓ నిర్ణయం తీసుకోండి.