గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (18:01 IST)

నాతో తృప్తి లేదట.. మూడు ఆప్షన్లు ఇచ్చి డిసైడ్ చేయమంటోంది... ఏం చేయాలి?

నా వయస్సు 32 యేళ్లు. నాలుగేళ్ళ కిందట వివాహమైంది. నా భార్య వయస్సు 25. వివాహానికి ముందు నాకు ఎలాంటి సెక్స్ అనుభవం లేదు. పైగా.. శృంగారంపై కూడా పెద్దగా ఆసక్తి, అవగాహన లేదు. నా ధ్యాస అంతా చదువులపైనే ఉండేది. మా యిద్దరికి నిశ్చితార్థం అయిన తర్వాత ఆమెతో ఫోనులో మాట్లాడేవాడిని. అపుడు ఎంతో థ్రిల్‌గా ఉండేది. వివాహం తర్వాత శోభనం రోజున ఏం చేయాలో తెలియక పోవడంతో మిన్నకుండిపోయా. అపుడు నా భార్య సహాయం చేసింది. ఆమె చెప్పినట్టు చేశాను. అయితే, కేవలం ఒకటి రెండు నిమిషాలకే వీర్యాన్ని స్ఖలించాను. 
 
మూడేళ్ళ తర్వాత ఢిల్లీకు మకాం మార్చాం. ఢిల్లీకి వచ్చాక ఆమెలో చాలా మార్పులు కనిపెట్టాను. తన అందాలను ఎక్స్‌పోజ్ చేయడం, సెక్స్ కోసం పరితపించడం, నా స్నేహితులతో ఎక్కువగా మాట్లాడటం చేయడం ప్రారంభించింది. దీంతో ఆమెను నిలదీశాను. నాతో సెక్స్ పరంగా సుఖపడటం లేదని తేల్చి చెప్పింది. పైగా వివాహానికి ముందు ఉన్న సెక్స్ సంబంధాన్ని పూసగుచ్చినట్టు చెప్పడమే కాకుండా, వివాహం తర్వాత కూడా అతనితో సుఖం పొందుతున్నట్టు వివరించింది. ఆ తర్వాత వారిద్దరికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా చూపించింది. అతను చేసినట్టుగా సెక్స్ చేస్తూ తృప్తి పరచమంటోంది. నాకు అంత శక్తి లేదని చెప్పా. దీంతో మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి మా కంపెనీ బాస్‌ లేదా నా స్నేహితుడు లేదా పక్కింటి అబ్బాయితో సంబంధం పెట్టుకుంటానని తెగేసి చెప్పి, వారం రోజుల పాటు గడువు విధించింది. ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో నన్నే చెప్పమంటోంది. నేనేం చేయాలి. ఆమెను వదిలేయొచ్చా.. లేక ఆమె ఆప్షన్లకు సమ్మతించి మిన్నకుండి పోవడమా? సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భార్య.. మరో వ్యక్తితో సెక్స్ చేస్తున్న వీడియోను చూసి కూడా ప్రశాంతంగా సలహా అడుగుతున్నారంటే... మీ ఓర్పు, సహనానికి ధన్యవాదాలు. దీనికి కారణం పడక గదిలో భార్యను సంతృప్తి పరచలేక పోవడం వల్లే ఆమె ఈ విధంగా బరితెగించి ప్రవర్తిస్తోంది. అయితే, పెళ్ళికి ముందు నుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగివున్నట్టు మీకు రూఢీ అయింది. ఈ పరిస్థితుల్లో మీ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆమెకు విడాకులిచ్చి... ఆమె నుంచి వేరుపడటం. లేదా ఆమెను సంతృప్తి పరిచేలా పడక గదిలో శృంగారంలో పాల్గొనడం. ఇందుకోసం మీలో ఉండే బలహీనతలను అధికమించాల్సి ఉంటుంది. వీటిలో శీఘ్రస్ఖలనం సమస్య. దీనికోసం వైద్యులను సంప్రదించి, తగిన వైద్యం చేయించుకోవడం. అలాగే, సెక్స్ పై పూర్తి అవగాహన, పట్టు పెంచుకోవడంతో పాటు.. భార్యపై పడక గదిలో పైచేయి సాధించేలా శృంగారంలో ఆమెను ఉక్కిరిబిర్కికి చేయడం. అందువల్ల ఈ ఆప్షన్లలో ఏది మీకు సంతృప్తికరంగా, అనుకూలంగా ఉంటుందో మీ మనస్సు ఏం చెపుతుందో తదునుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఇందులో ఇతరుల సలహాలు స్వీకరించడం మంచిదికాదు.