మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 22 జులై 2015 (13:57 IST)

నాకు జి-స్పాట్ తాకాలని ఉంది... అదెక్కడ ఉంటుంది...?

పెళ్లయిన దగ్గర్నుంచి నా భార్యను శృంగారంలో అమితానందం కలిగింపజేద్దామని అనుకుంటున్నా కుదరడం లేదు. ఐతే జి స్పాట్ వద్ద ఒరిపిడి కలిగిస్తే బాగా స్పందన ఉంటుందనీ, తృప్తి చెందుతారని విన్నాను. అది ఎక్కడ ఉంటుంది...?
 
సాధారణంగా జి-స్పాట్‌ అనేది స్త్రీ బీజవాహికపై కప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సునిశతమైన ప్రాంతం. దీన్నీ జీస్పాట్ అంటారు. ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలుజొప్పించి అంతటా కలియతిప్పుతూ అక్కడ స్పర్శించే సరికి సుఖానుభూతులతో స్త్రీ మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ద్రవం (మూత్రం కాదు) వెలువడుతుందనే విషయాన్ని 1950లోనే గ్రాఫెన్‌బర్గ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే.. ఈ ప్రాంతానికి ఆయన జ్ఞాపకార్థం గ్రాఫెన్‌ బర్గ్‌ స్పాట్‌ అనీ, (క్లుప్తంగా జి-స్పాట్‌) అని పిలుస్తారు. 
 
అయితే, స్త్రీలందరికీ నిజంగానే జి-స్పాట్‌ ఉంటుందా అనే ధర్మ సందేహం తలెత్తింది. జి-స్పాట్‌ గురించి పరిశోధిస్తూ కొంత మంది డాక్టర్లు అదెలా ఉంటుందో చూద్దామని ఆ భాగంలో ఆపరేషన్‌ చెయ్యాల్సిన సందర్భాలు ఉన్నాయని చెపుతుంటారు. పైగా స్త్రీలు జి-స్పాట్‌ స్పర్శకి పులకరించినప్పడు విడుదలయ్యే మూత్రనాళ ద్రవంలో ప్రోస్టేటు గ్రంథిలో ఉండే రసారయనాలే ఉన్నట్టుగా వైద్యులు తమ పరిశోధనల్లో నిర్ధారించారు.