గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (16:32 IST)

నేను ఒత్తిడి తెచ్చినా సెక్స్‌కు మొగ్గు చూపడం లేదు.. నా భర్త గేనా?

నాకు వివాహమై మూడేళ్లు అయింది. ఇప్పటి వరకు చేతి వేళ్లపై లెక్కిపెట్టుకునేలా మాత్రమే మేమిద్దరం సెక్స్‌లో పాల్గొన్నాం. ముఖ్యంగా.. నేను  సిగ్గు విడిచి ఒత్తిడి చేస్తేగానీ ఆయన సెక్స్‌లో పాల్గొనేందుకు రావడం లేదు. ఒకవేళ అలాంటి ప్రస్తావన తెచ్చినా బిజీగా ఉన్నట్టు గడుపుతున్నారు. అదేసమయంలో ఆయనకు పరాయి స్త్రీలతో సంబంధం ఉన్నట్టు నేను భావించడం లేదు. ఎందుకంటే.. ఓ గూఢచార సంస్థ సభ్యులతో నిఘా కూడా పెట్టించి నిర్ధారించుకున్నా. దీంతో నేను ఓ నిర్ధారణకు వచ్చి.. నా భర్త గే అని అనుకుంటున్నా. నా భావన నిజమేనా? 
 
ఖచ్చితంగా ఆయన గే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఒత్తిడి తెచ్చినపుడైనా సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ దాంపత్య తృప్తిని పొందుతున్నారు. అలాంటపుడు గే అని ఎలా భావించగలం. గే అయివుంటే.. ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల సాన్నిహిత్యం కోసం ఆయన పరితపించేవాడు. కానీ అలాంటిది జరగడం లేదు. పైగా.. పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం లేదని నిర్ధారించుకున్నారు కూడా. అందువల్ల గే అనే భావనకు రావొద్దు. ముఖ్యంగా... ఆయనకున్న పని ఒత్తిడి కారణంగానే ఆ విధంగా ప్రవర్తిస్తున్నట్టు, మూడీగా ఉన్నట్టు తెలుస్తోంది. సెక్స్ నిపుణులను సంప్రదించినట్టయితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.