శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (17:23 IST)

నా బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొంటున్నా.. ఏ ఫీలింగూ లేదు.. ఎందుకని?

నాకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. అతనితో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటున్నా. కానీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదు. కానీ, నాకు ఓ స్నేహితురాలు ఉంది. ఆమె రెండు రోజుల పాటు భర్తకు దూరంగా ఉండలేను అని చెపుతోంది. ముఖ్యంగా సెక్స్‌లో పాల్గొనకుండా ఉండలేనని చెప్పింది. మరి నాకేంటి ఎలాంటి ఫీలింగూ లేదు. రేపు వివాహమయ్యాక... నా భర్తతో కూడా ఇదే అనుభూతి కలుగుతుందన్న భయం పట్టుకుంది. నా సమస్యకు పరిష్కారమేంటి? 
 
పెళ్లికాకుండా వివాహేతర సంబంధాల్లో పాల్గొంటే ఇలాంటి అనుభూతి, ఇబ్బందులే కలుగుతాయి. సెక్స్‌లో పాల్గొన్నపుడు ఎలాంటి అనుభూతి కలగక పోవడానికి కారణం ఎవరైనా చూస్తారేమో, ఎవరికైనా తెలుస్తుందేమోనన్న భయం మీలో ఉంది. ఇలాంటి భయాలు మనస్సులో కలిగినపుడు ఖచ్చితంగా సెక్స్‌లోని అనుభూతిని పొందలేరు. లేదా మొక్కుబడిగా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొన్నా ఇలానే జరుగుతుంది. పెళ్లి చేసుకుని భర్త మనస్సుకు దగ్గరై సెక్స్‌లో పాల్గొన్నపుడు శృంగార జీవితంలోని ఆనందపు రుచి తెలుస్తుంది. మనస్సును ఉత్సాహంగా ఉంచుకుంటూ పెళ్లయ్యేంత వరకు సెక్స్ గురించి ఆలోచన చేయకండి.