శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (17:24 IST)

నా వయస్సు 20 యేళ్లు 60 యేళ్ల వ్యక్తితో సెక్స్‌లో పాల్గొనడం హానికరమా?

మాది విజయవాడ. నా వయస్సు 20 యేళ్లు. చదువు మధ్యలో ఆపేసి ఇంట్లోనే ఉంటున్నా. మా ఇంటి పక్కనే ఉన్న 60 యేళ్ల వ్యక్తితో మంచి సన్నిహిత సంబంధం ఉంది. దీంతో అనుకోకుండా అతనితో సెక్స్‌లో పాల్గొన్నా. అప్పటి నుంచి తరచుగా మేమిద్దరం శారీరకంగా ఒక్కటవుతూ సంతృప్తి చెందుతున్నాం. గర్భం రాకుండా కండోమ్ వాడుతున్నాం. అయితే, 60 యేళ్ల వ్యక్తితో సెక్స్ చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? సలహా ఇవ్వండి. 
 
చిన్న వయస్సులో ఇలాంటి చెడు అలవాట్లు ఏమిటి. మీ ఇద్దరి మధ్యా 40 యేళ్ల వ్యత్యాసం ఉంది. అంటే తాత వయస్సున్న వ్యక్తితో సెక్స్ చేయించుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది. అతని వల్ల గర్భం వస్తే తల్లిదండ్రులకు, సమాజానికి ఏమని సమాధానం చెపుతావు. 60 యేళ్ల వ్యక్తిని భర్తగా స్వీకరిస్తావా? పైగా 60 యేళ్ల వ్యక్తికి ఖచ్చితంగా అనేక మంది మహిళలతో సెక్స్‌లో పాల్గొనివుండొచ్చు. అలాంటి వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. 
 
సాధారణంగా రుతుస్రావమైన తర్వాత పదో రోజు నుంచి 18వ రోజు లోపల అండం విడుదల అవుతుంది. కొద్ది మందిలో అలా కాకుండా ముందు వెనుక అండం ఎపుడైనా విడుదల కావొచ్చు. పైగా... ఏది మంచో ఏది చెడో తెలియని వయస్సులో ఉన్నావు. ఆ వయస్సు వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల అతనికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.