గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (15:04 IST)

నా ఫ్రెండ్‌తో ఫింగరింగ్ చేయించుకుంటా.. డాక్టర్‌కు తెలుస్తుందా?

నా వయస్సు 18 యేళ్లు. డిగ్రీ చేస్తున్నా. నేను 13వ యేటనే రజస్వల అయ్యాను. రజస్వల కాకముందు నుంచే నాకు శృంగార కోర్కెలు ఎక్కువ. దీంతో నా స్నేహితులతో అపుడపుడు హస్త ప్రయోగం, ఫింగరింగ్ చేయించుకుంటున్నా. రజస్వల అయ్యాక ఇది మరింతగా ఎక్కువైంది. నా బెస్ట్ ఫ్రెండ్‌ నేనూ కలిసి రోజుకు ఆరేడు సార్లు చేసుకుంటాం. నేను కూడా ఖాళీదొరికితే హస్త ప్రయోగం కూడా చేసుకుంటున్నా. అయితే, ఈ మధ్య కాలంలో బహిష్టు సరిగా కావడం లేదు. డాక్టర్ వద్దకు వెళ్లి చూయించుకుందామంటే భయమేస్తోంది. నేను ఫింగరింగ్ చేయించుకునే విషయం  డాక్టర్‌కు తెలుస్తుందన్న భయం వెంటాడుతోంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. 
 
సాధారణంగా యుక్త వయస్సుకు వచ్చిన ఆడపిల్లలు కూడా యువకులు మాదిరిగానే హస్త ప్రయోగం చేసుకుంటూ తృప్తి చెందుతుంటారు. అయితే, స్నేహితురాలితో కలిసి ఫింగరింగ్ చేయించుకోవడం అనేది చాలా తక్కువ మంది యువతులు చేస్తుంటారు. అయితే, ఈ అలవాట్ల వల్ల మెన్సస్ సరిగా రాకపోవడం, పెళ్లయ్యాక పిల్లలు పుట్టక పోవడం వంటివి జరగవు. చాలా మంది యువతులకు రెగ్యులర్‌గా పీరియడ్స్ రావు. దీనికి కారణం వారిలో ఆదుర్దా, ఆందోళనల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. మరికొందరిలో థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నా ఇలానే జరుగుతుంది. అందువల్ల వైద్యులకు చూపిస్తే నీ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.