శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (17:40 IST)

అమ్మాయిని చూస్తే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్.. సెక్స్‌కు పనికొస్తానా?

చాలా మంది యువకులు అమ్మాయిలంటే హడలిపోతుంటారు. దీంతో వారి పక్కన నిలబడేందుకు కూడా జంకుతుంటారు. దీంతో తమకు యుక్త వయస్సులో కలిగే లైంగిక కోర్కెలను అణుచుకునేందుకు హస్త ప్రయోగం చేసుకుని సంతృప్తి పడుతుంటారు. వాస్తవానికి అమ్మాయిలంటే భయపడే యువకులు సెక్స్ జీవితానికి పనికి వస్తారా.? ఇలాంటి భయాందోళన వారి నుంచి పోగొట్టేందుకు ఎలాంటి కౌన్సెలింగ్ తీసుకోవాలన్న అంశంపై నిపుణులను సంప్రదిస్తే... 
 
హస్త ప్రయోగం వల్ల అంగస్తంభన లోపం వస్తుందన్న ఒక అశాస్త్రీయమైన భావజాలం ప్రచారంలో ఉంది. అది పూర్తిగా నిజం కాదు. హస్త ప్రయోగానికి, అంగస్తంభన లోపం రావడానికీ సంబంధం లేదు. కేవలం మానసిక కారణాలైన భయం, ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడి, సెక్స్ గురించిన అశాస్త్రీయమైన, నెగెటివ్ జ్ఞానం వల్ల మనో లైంగిక సమస్యగా భావించాలి. ఇలాంటి సమస్యకు సెక్స్ కౌన్సెలింగ్, సెక్స్ సైకాలజీ, సైకోథెరపీ, సెక్స్ థెరపీ తీసుకుంటే నీ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.