గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (19:06 IST)

హనీమూన్‌లో స్వర్గాన్ని చూశాం... ఇంట్లో కూడా అలానే తృప్తి పొందాలి.. ఏం చేయాలి?

నా వయస్సు 25 యేళ్లు. ఇటీవలే వివాహమైంది. హానీమూన్ కోసం బ్యాంకాగ్ వెళ్లాం. అక్కడ నా భర్త, నేను శారీరకంగా తొలిసారి కలిశాం. అలా వారం రోజుల పాటు అక్కడే ఎంజాయ్ చేశాం. స్పష్టంగా చెప్పాలంటే తొలి రెండు రోజులు మినహా మిగిలిన రోజులు స్వర్గాన్ని చూసినట్టుగా ఫీలయ్యాం. ఇలాంటి అనుభూతి మళ్లీమళ్లీ కావాలని ఇద్దరం తపిస్తున్నాం. అదే ఫీలింగ్‌తో ఇంటికి వచ్చాం. ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. అలాంటి ఫీలింగ్‌ పొందలేక పోతున్నామనే భావన ఏర్పడింది. ఇపుడు మా యిద్దరికీ ఒకటే సమస్య.. హనీమూన్ సమయంలో పొందిన ఫీలింగ్‌నే ఇంట్లో కూడా పొందాలి ఏం చేయాలి? 
 
సాధారణంగా శృంగారం అనేది ఏ ఒక్కరో అనుభవించేది కాదు. స్త్రీపురుషులు కలిసి అనుభవించేది. భార్యాభర్తలిద్దరికీ కోర్కెలు తారా స్థాయికి చేరినపుడు అలాంటి అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా పురుషునితో పాటు స్త్రీలో కలిగే కోర్కెలకు అనుగుణంగా వారిద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా బాహ్యరతితో పాటు యోనిని, వజీనాను ముద్దాడుతూ.. వక్షోజాలను చూషిస్తూ... పిరుదులు, నడుం వంటి భాగాలను సుతారంగా తాకాలి. ఇలా చేయడం వల్ల స్త్రీ నిజంగానే స్వర్గలోకపు సుఖాన్ని అనుభవించినట్టుగా ఉంటుంది.
 
అంతేకాకుండా, పురుషుడు కూడా.. స్త్రీని తృప్తి పరచాలంటే కేవలం సెక్స్ చేస్తేనే సరిపోదు. ఆమె మనస్సులోని కోర్కెలను తెలుసుకుని తదనుగుణంగా పురుషుడు మెలగాలి. ఇందుకోసం తనకు తెలిసిన విషయ పరిజ్ఞానంతో భార్యను సుఖపెట్టేందుకు ప్రయత్నించాలి. ఫలితంగా స్త్రీలు శృంగార స్వర్గాన్ని అనుభవిస్తారు. ఇలాంటి సమయంలో పురుషుడు తనను పూర్తిగా ఆక్రమించి, అనుభవించేందుకు సహకరించాలి. ఆ తర్వాతే యోనిలో పురుషాంగ ప్రవేశానికి అనుమతించాలి. పురుషునిలో వీర్యస్ఖలనం (భావప్రాప్తి) తర్వాత సెక్స్ కోర్కెలు తగ్గిపోతాయి.
 
ఇక్కడ నుంచి స్త్రీ ఆ విధులను నిర్వహించాలి. అర్థ గంట తర్వాత పురుషుడు మళ్లీ కోర్కెలతో రగిలిపోయేందుకు భార్యతో ప్రేమగా ముద్దాడుతూ మళ్లీ శృంగార చర్యలకు ఉపక్రమించేలా చేయాలి. అయితే, చాలా మంది మహిళలు ఈ పని చేయరు. పురుషుడుని రెండో రౌండ్ సెక్స్‌ కోసం తయారు చేయాలంటే ఈ చర్య చాలా ముఖ్యం. మొదటి రౌండ్‌లో పురుషుడు తొలుత యాక్టివ్‌గా ఉంటే రెండో రౌండ్‌లో స్త్రీ ఆ పాత్రను పోషించి, పురుషుడిని పూర్వ స్థితికి తెచ్చుకోవాలి. 
 
రెండో రౌండ్‌లో పురుషుడికి వీర్యస్ఖలనం ఆలస్యమవుతుంది. ఎందుకంటే మొదటి రౌండ్‌లోనే వీర్యస్ఖలనం కావడం వల్ల భావప్రాప్తి పొందివుంటాడు. అందువల్ల రెండోసారి భావప్రాప్తి పొందేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే, మహిళ కూడా రెండో రౌండ్‌లో ఎక్కువ సమయం సెక్స్‌ను అనుభవించవచ్చు. అందువల్ల మొదటి రౌండ్ సెక్స్ తర్వాత రెండు, మూడు రౌండ్ల కోసం పురుషుని ఉద్రేకపరచడం స్త్రీ చేతిలోనే ఉంది. ఈ పాత్రను స్త్రీ నిర్వహించినట్టయితే, పురుషుడు పరమానందం చెందుతాడని నిపుణులు సలహా ఇస్తున్నారు.