గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (16:11 IST)

నా గర్ల్‌ఫ్రెండ్‌కు భావప్రాప్తి ఇవ్వడమెలా?

మాది బెంగుళూరు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఇద్దరికీ సెక్స్‌లో పాల్గొనాలని ఆసక్తిగా ఉంది. కానీ, సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం వస్తుందన్న భయం మమ్మలను వెంటాడుతోంది. పైపెచ్చు.. గర్భం రాకుండా సెక్స్‌లో పాల్గొనడం ఎలా.? వీర్యాన్ని యోనిలో స్ఖలిస్తే గర్భం వస్తుందా? కండోమ్ లేదా పిల్ వాడటం ఇష్టం లేదు. ఏం చేయాలి సలహా ఇవ్వండి.? 
 
ప్రతి ఒక్కరికీ తెలిసిన పద్ధతి కండోమ్‌ వినియోగించడం. చాలా మంది దంపతులు వివాహం తర్వాత పిల్లలు పుట్టకుండా ఉండేందుకు పాటించే పద్దతి ఇదే. కండోమ్ ధరించడం వల్ల వీర్యాన్ని యోనిలో స్ఖలించడమే కాకుండా, సంపూర్ణ భావప్రాప్తి కూడా పొందవచ్చు. అలాగే, సుఖ వ్యాధుల నుంచి కూడా స్త్రీపురుషులకు రక్షణ పొందవచ్చు. ఇంతకుమించిన అతి సులభమైన పద్దతి మరొకటి లేదని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. 
 
అయితే, మరికొంతమంది దంపతులు రుతుచక్రం (బహిష్టు)పై ఆధారపడి సెక్స్‌లో పాల్గొంటుంటారు. స్త్రీ బహిష్టు అయిన తర్వాత ఐదో రోజు నుంచి 15వ రోజు వరకు సెక్స్‌కు దూరంగా ఉంటారు. ముఖ్యంగా అండం విడుదలయ్యే రోజులైన 10 నుంచి 15 లేదా 17 రోజుల్లో సెక్స్‌లో పాల్గొనకుండా, ఆ తర్వాత సెక్స్‌లో పాల్గొంటూ రతి సుఖాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఈ క్యాలెండర్ విధానం వల్ల అనేకసార్లు గర్భం వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
మరికొందరు పిల్ వాడుతుంటారు. సెక్స్‌లో పాల్గొనే ముందు లేదా సెక్స్ పూర్తయిన 72 గంటల వ్యవధిలో పిల్ వేసుకోవడం వల్ల గర్భం రాదని చెపుతున్నారు. కొంతలో కొంత మేరకు ఇది నిజమైనప్పటికీ.. ఈ పిల్స్ వల్ల స్త్రీ అనారోగ్యం పాలవుతుందని అనేక మంది సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పిల్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమని చెప్పొచ్చు.