శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 23 జూన్ 2015 (16:57 IST)

వారిది చిన్నది.. నాది పెద్దది... దగ్గరకు వచ్చేందుకు భయపడుతున్నారు.. ఏం చేయాలి?

మావారి అంగం చాలా చిన్నది. అదేసమయంలో నేను బొద్దుగా, లావుగా ఉండటంవల్ల నా యోని పెదవులు లావుగా ఉన్నాయి. దీంతో యోని పెద్దదిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ కారణంగా నన్ను తృప్తిపరచలేనన్న భయంతో మావారు నావద్దకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. అంగం సైజుతో పనిలేదనీ.. ఇద్దరం సంతోషంగా శారీరకంగా కలుద్దామని ఎంతగా నచ్చజెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఏం చేయాలి.. మా ఇద్దరి కోర్కెలు తీర్చుకునే మార్గమేంటి...
 
పురుషుడి మనస్సులో స్త్రీని శారీరకంగా సంతృప్తిపరచలేనన్న భావన పడిపోయినపుడే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అంగం సైజుతో పనిలేదని చెప్పినప్పటికీ.. ఆయన వెనుకంజ వేస్తున్నారంటే కాస్తంత ఆలోచించాల్సిన విషయం. దాంపత్య జీవితంలో పురుషుని పాత్ర ఎంత కీలకమో స్త్రీపాత్ర కూడా అంతేముఖ్యం. ఆ విషయం అర్థం చేసుకున్నారు కాబట్టే భర్తను మరింత నిరుత్సాహపరచకుండా ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఆయన మనస్సులో నిగూఢమైవున్న భావనను పోగొట్టి యధాతథస్థితికి తీసుకునిరావడం అంతసులభమైన విషయంకాదు. అయినప్పటికీ.. మీవంతు ప్రయత్నంగా ఇతర బాహ్య రతి పద్ధతులను పాటిస్తూ ఆయనను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేయండి. అప్పటికీ రాకుంటే సెక్స్ కౌన్సెలింగ్ ఇప్పించడమే ఏకైక మార్గం.