గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (19:18 IST)

ఆలుమగల మధ్య గొడవలకు కారణాలేంటి?

ఏ బంధానికైనా నమ్మకమే పునాది. అందులోనూ ఆలుమగల బంధానికి ఇది ప్రధాన ప్రాతిపదిక కూడా. అయితే అది కేవలం పైపై మాటలకే పరిమితం కాకుండా చూసుకోవాలి. పొరపాట్లు ఎవరి జీవితంలోనైనా సహజమే. వాటిని భాగస్వామిగా అర్థం చేసుకోవాలి. అయితే అటువంటివి జరగకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సున్నితంగా తెలియజేయాలి.
 
భాగస్వామి వద్ద ఇంట్లో ఇతరులకు లభించే ప్రాధాన్యత తమకు లభించడం లేదని కొంతమంది వాపోతుంటారు. దీనికి కారణాలేవైనా ఆ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిందే. అవతలి వారు ఆ విధంగా అనుకుంటున్నప్పుడూ.. బహిరంగంగానే అంటున్నప్పుడూ ఇంకొకరు దాన్ని పట్టించుకోవాలి. ఇద్దరూ కూర్చుని అలా జరగడానికి ఏయే కారణాలు దోహం చేస్తున్నాయో చర్చించుకోవాలి. అవతలి వారిలో చోటుచేసుకున్న అభద్రతను పోగొట్టి వారికి తమ దగ్గర ఎంత ఉన్నత స్థానముందో తెలియజేయాలి. 
 
తమ దగ్గర విషయాలను దాచిపెడుతున్నారన్న అపనమ్మకమే చాలాసార్లు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం అవుతుంది. వీలైనంతవరకూ ఇద్దరి మధ్యా అపోహలకూ, అపార్థాలకూ తావు లేకుండా పారదర్శకంగా ఉండేలా ప్రయత్నించండి.