మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:39 IST)

ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని.. భార్యను అనుమానించేవారు...

చాలామంది యువతులకు తొలిసారి శారీరకంగా కలిసినపుడు రక్తస్రావం అనేది జరగదు. దాంతో ఆమెకు పూర్వానుభవం ఉందని భర్తలు అనుమానిస్తుంటారు. ప్రతి అమ్మాయికీ తొలి కలయికలో రక్తస్రావం కనిపించాలనీ లేదంటే ఆమెకు అంతకుముం

చాలామంది యువతులకు తొలిసారి శారీరకంగా కలిసినపుడు రక్తస్రావం అనేది జరగదు. దాంతో ఆమెకు పూర్వానుభవం ఉందని భర్తలు అనుమానిస్తుంటారు. ప్రతి అమ్మాయికీ తొలి కలయికలో రక్తస్రావం కనిపించాలనీ లేదంటే ఆమెకు అంతకుముందు అనుభవం ఉందని భావించాలనీ బ్యాచిలర్స్‌గా ఉన్న సమయంలో స్నేహితులు చెబుతుంటారు. దీనిపై శృంగార వైద్య నిపుణులను సంప్రదిస్తే...
 
నిజానికి ప్రతి అమ్మాయికీ అలా జరగాలని లేదు. కొందరికి రక్తం కనిపించవచ్చు. మరికొందరికి కనిపించకపోవచ్చు. అంతమాత్రాన ఆమెను కన్య కాదని చెప్పలేం. తొలి కలయికలో రక్తం కనిపించడానికి కారణం.. కన్నెపొర చిరిగిపోవడమే. ఈ పొర కొందరిలో మందంగా ఉండి తొలి కలయికతోనే చిరుగుతుంది. ఎక్కువశాతం మందిలో ఈ పొర పలుచగా ఉండి బాల్యంలో ఆటలాడే సమయంలోనే చిరిగిపోతుంది.
 
ఎత్తు నుంచి దూకినా, గుర్రపు స్వారీ చేసినా.... ఇలా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఎలాంటి ఆటలాడే సమయంలోనైనా కన్నెపొర చిరిగిపోవచ్చు. ఇలాంటి అమ్మాయిలకు తొలి కలయిక సమయంలో రక్తం కనిపించదు. చాలా మంది నవ వధువులకు ఇలానే జరుగుతుంది. రక్తస్రావం గురించి మీ స్నేహితులు చెప్పిన మాటలు విని భార్యను అనుమానించి బాధ పెట్టరాదు. మనసు నుంచి అనుమానాలను వెళ్లగొట్టి, దాంపత్య జీవితాన్ని ఆనందించాలని శృంగార వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.