శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (13:31 IST)

నేను ఒత్తిడి చేస్తేగానీ సెక్స్ చేయనంటున్నారు.. ఆయన గేనా...?

నాకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన నా పట్ల ఎలాంటి ప్రేమ అభిమానాలు చూపడం లేదు కదా.. సెక్స్‌కు కూడా దూరంగా ఉంటున్నారు. ఒక్కోసారి నాలో కోర్కెలను ఆపుకోలేక నేను బలవంతం చేస్తేగానీ, శారీరకంగా కలవనంటున్నాడు. అప్పటికీ సిగ్గు విడిచి అలానే ఒత్తిడి చేస్తూ కాస్తంత సెక్స్ ఉపశమనం పొందుతున్నా. పైగా ఆయన నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. ఆఫీసులోనే కాదు. ఇంట్లో కూడా అదే విధంగా గుడుపుతారం. అప్పటికీ నేనే కల్పించుకుని అతనితో సెక్స్ టాపిక్స్ గురించి మాట్లాడితే అరకొరగా సమాధానం ఇస్తుంటారు. పైగా, మరో యువతి లేదా మహిళతో కూడా సంబంధం లేదు. ఈ విషయాన్ని నూటికి నూరు శాతం నమ్మకంగా చెప్పగలను. పెళ్లికి ముందు ఎవరితోనైనా సెక్స్ సంబంధాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం నేను చెప్పలేను. అయితే, ఇపుడు నా ప్రశ్న ఏంటంటే.. కేవలం పని ఒత్తిడి కారణంగానే ఆయన సెక్స్‌కు దూరంగా ఉంటున్నారా లేక గేనా అనే విషయం అర్థం కావడం లేదు...
 
మీ భర్త గే అని భావించవద్దు. ఎందుకంటే.. ఒత్తిడి చేస్తే శృంగారంలో పాల్గొంటున్నారని చెప్పారు. అందువల్ల ఆ సమయంలో మీరు దాంపత్య సుఖం పొందుతున్నట్టే. అలాంటపుడు ఆయన గే ఎలా అని అనుకుంటారు. కేవలం పని ఒత్తిడి కారణంగానే అలా నడుచుకుంటున్నట్టున్నారు. ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇంట్లో కూడా పనిలో నిమగ్నమైపోతున్నాడు. ఫలితంగా మీపట్ల ఎక్కువ శ్రద్ధ చూపించలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితిని చాలామంది పురుషులు ఎదుర్కొంటుంటారు. అందువల్ల దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఒకరి సమస్యలు ఒకరు వివరించుకోవడం వల్ల కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.