శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2014 (17:01 IST)

విడిపోతున్నాం కదా.. ప్లీజ్ అన్నాడు.. సెక్స్‌కు సమ్మతించా... కన్యత్వం...

నా వయస్సు 24 యేళ్లు. గత యేడాదే చదువులు ఆపేశాను. కాలేజీలో చదివే సమయంలో నాకో ఫ్రెండ్ ఉండేవాడు. మేమిద్దరం శృంగారపరమైన అంశాలతో పాటు ఇతర విషయాలన్నింటినీ ఓపెన్‌గా చర్చించుకునేవాళ్లం. ఈ పరిస్థితుల్లో కాలేజీ చివరి రోజుల్లో అతను నా దగ్గరకు వచ్చి.. మనమిద్దరం విడిపోతున్నాం కదా.. ఒక్కసారి నీతో కలవాలని కోర్కె ఉందని ప్రాధేయపడుతూ చెప్పాడు. అతని బేల మొహం చూసి కరిగిపోయి ఒక్కసారే కదా అని అతనితో సెక్స్‌లో పాల్గొన్నా. సెక్స్‌ పూర్తయిన తర్వాత నా యోని నుంచి బ్లీడింగ్ అయింది. అంటే నా ఫ్రెండ్ ద్వారానే కన్యత్వం పోయిందని గ్రహించాను. ఈ విషయం రేపు నేను పెళ్లి చేసుకునే భర్తకు తెలుస్తుందా? సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
నేటి కాలంలో కన్యత్వం అనేది కొంతమంది మాత్రమే పట్టించుకునే విషయంగా మారిపోయింది. స్త్రీలో హైమన్ పొర ఉంటే కన్య అని.. అది లేకుంటే కన్యత్వం లేనివారిగా నాడు భావించేవారు. అలాగే, తొలిసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత యోని నుంచి రక్తస్రావం రావాలన్న నిబంధన లేదు. అందువల్ల మీ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొన్నాననే విషయం మీకై మీరు చెపితే మినహా.. ఈ విషయం మీ భర్తకు తెలిసే అవకాశం లేదు. అందువల్ల నిర్భయంగా మీరు వివాహం చేసుకుని దాంపత్య సుఖాన్ని ఎంజాయ్ చేయండి.