శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 16 జులై 2014 (19:05 IST)

ఆమె ఇచ్చిన సుఖం మరచిపోలేక పోతున్నా.. ఏం చేయాలి!!

మాది విజయవాడ. ఇటీవల హైదరాబాద్‌లో ఉండే మా బాబాయ్ వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ పక్కింటి ఆంటీని చూసి మనస్సుపడ్డాను. మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎంతగా పెరిగిందంటే.. ఐదో రోజునే నేను జీవింతో మరిచిపోలేని సుఖాన్ని పొందాను. నిజంగా ఆమె నాకు సుఖం ఇచ్చేందుకే పరిచయమైందన్న భావన ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను మరచిపోలేక పలు మార్లు హైదరాబాద్ వెళ్లి.. ఆమెతో శారీరక సుఖాన్ని అనుభవించాను. అయితే, ఆమెను శాశ్వతంగా నేను సొంతం చేసుకోవాలని భావించి ఆమె వద్ద ప్రస్తావించగా.. భర్తను వదిలి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేస్తూనే... మరోమారు శృంగార స్వర్గాన్ని చూపించి వెళ్లిపోయింది. ఆమె ద్వంద్వ ప్రవర్తనకు అర్థమేంటి... వివరించగలరు. 
 
సమాజంలో ఇలాంటి కొత్త సుఖాలు కోరుకునే మహిళలు చాలా మంది అక్కడక్కడా కనిపిస్తుంటారు. నిజానికి ఇంట్లో తెలియనంత వరకు ఈ తరహా కొత్త సంబంధాలు.. కొత్త రుచులు బాగానే ఉంటాయి. అదేసమయంలో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆమె మీద మనస్సు పారేసుకుంటే నష్టపోయేది మీరే. కానీ, తను మీద అపవాదు వస్తే ఎలా తప్పించుకోవాలో ఆమెకు బాగా తెలుసు. అందువల్ల మీయిద్దరి మధ్య ఏమి జరగలేదన్నట్టుగా భావించి మిన్నకుండి పోండి.