గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (17:46 IST)

ఫ్రీ డెలివరీ కోసం సెక్స్‌ చేయమంటే నా భర్త చేయడం లేదు ఎందుకని?

మాది విజయవాడ. ఓ యేడాది క్రితం వివాహమైంది. మా ఆయన ఉద్యోగం చేస్తుంటే నేను ఇంటిపట్టునే ఉంటున్నా. ఇపుడు నేను ఆర్నెల్ల గర్భవతిని. ప్రెగ్నెన్సీ వచ్చాక స్త్రీ ప్రసవించే ముందు భర్తతో సెక్స్‌లో పాల్గొంటే మంచిదని పలు పుస్తకాల్లో చదివాను. అలా పాల్గొనడం వల్ల ఫ్రీ డెలివరీ అవుతుందని విన్నాను. దీంతో నా భర్తను రోజూ సెక్స్‌ చేయని ప్రాధేయపడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఈ సమయంలో సెక్స్ చేస్తే అబార్షన్ అవుతుందని భయపెడుతున్నారు. నా భర్త చెప్పేది నిజమా.. లేక నాకు తెలిసిన విషయం నిజమా. వివరించండి. 
 
సాధారణంగా డెలివరీకి ముందు సెక్స్‌లో పాల్గొంటే ఫ్రీ డెలివరీ అవుతుందనేది నిజం కాదు. పైపెచ్చు.. ఆ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం గర్భిణులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. పురుషుడు కూడా గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేయలేని పరిస్థితి ఉంటుంది. భార్యకు అనువుగా ఉండే భంగిమను ఎంచుకుని శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే, కొంతమందికి ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక సెక్స్‌లో పాల్గొంటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ భర్త చెప్పినట్టుగానే నడుచుకోండి.