గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PYR
Last Modified: శుక్రవారం, 30 జనవరి 2015 (05:10 IST)

వీర్యాన్ని స్ఖలించకపోతే నంపుసకులు అవుతారా...? ఆరోగ్య సమ్యలు వస్తాయా..!?

వీర్యాన్ని స్ఖలించకుండా అలాగే ఉండిపోతే.. నంపుసకులు  అయిపోతారా... లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనా.. త్వరగా వీర్యం లీకైపోతోందని మందులు తీసుకుని ఆపడం కూడా తప్పా..! దాని వలన రోగాలు వస్తాయా.. వస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి.? వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
 
వీర్యం చాలా త్వరగా లీకై పోతోందని చాలా ఆందోళన చెందుతుంటారు. దానిని కొద్ది సేపు అపుకోవడానికి రకరకాల మాత్రలు, మందులు వినియోగిస్తుంటారు. ఇలా చేయడం తప్పా... అంటే అవుననే అంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు. శరీర ధర్మం ప్రకారం బయటకు వెళ్ళిపోవలసిన ఏ పదార్థాన్ని ఏ ధర్మాన్ని మన కృత్రిమంగా ఆపడానికి ప్రయత్నం చేస్తే అది నూటికి నూరు పాళ్లూ తప్పే అవుతుందని అంటున్నారు. 
 
అలా ఆపడం వలన నపుంసకత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో అలా ఆపడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయని చెప్పారు. జననావయవాల నొప్పి, జ్వరం వంటి వస్తాయి. అంతే కాదు వృషణాల నొప్పి కూడా మొదలవుతుంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కనుక స్ఖలనం అయ్యే వీర్యాన్ని స్ఖలించాల్సిందేనని అంటున్నారు. ఒక వేళ త్వరగా లీకైనా సరే మరోసారి రతి క్రీడలో పాల్గొనే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇలా చేయడం వలన వెంటనే స్ఖలించడమనేది తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.