శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 27 నవంబరు 2014 (20:37 IST)

మా అమ్మాయి చాటుగా సెక్స్ పుస్తకాలు చదువుతోంది... ఏం చేయాలి...?

నాలుగు దశల జీవితంతో మానవుడి మనుగడ జరుగుతూ ఉంటుంది. బాల్యదశ, కౌమార దశ, యౌవన దశ, వృద్ధాప్యం అనే నాలుగు దశల్లో మనిషికి అత్యంత కీలకమైనవిగా కౌమార, యౌవన దశలు చెప్పబడ్డాయి. కౌమారంలో శరీరంలోని సెక్స్ సంబంధిత గ్రంధులు పనిచేయడం ప్రారంభమవుతుంది. దీంతో సెక్స్ సంబంధమైన కోర్కెలు మెల్లగా కలుగుతుంటాయి. అమ్మాయిల పట్ల అబ్బాయిలు, అబ్బాయిల పట్ల అమ్మాయిలు పరస్పరం ఆకర్షణ మొదలవుతుంది. 
 
యౌవన దశకు చేరుకునేసరికి శరీరంలో రేగే సెక్స్ వాంఛలను తీర్చుకునేందుకు తహతహలాడుతుంటారు. ఇందుకోసం గోప్యంగా సెక్స్ సంబంధిత పుస్తకాలను చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే రతి సంబంధమైన విషయాలను గోప్యంగా చదవడం ఇంట్లో చేయకుండా కొందరు ఆఫీసుల్లోనో, చదువుకునే విద్యాలయాల్లోనో చేస్తుంటారు. ఈ విషయాన్ని ఎవరైనా గమనిస్తే భయపడిపోతూ చటుక్కున పుస్తకాన్ని దాచేస్తారు. 
 
అయితే ఇటువంటి భేషజాలు పోవాల్సిన అవసరంలేదు. జీవితంలో సగభాగం దాంపత్య జీవితంతో ముడిపడి ఉంటుంది కనుక రతి గురించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. 
 
యౌవన ప్రారంభంలో ఇలా సిగ్గుపడిపోతూ సెక్స్ బుక్స్‌ను చదివే యువతీయువకులు పెళ్లయిన తర్వాత కూడా వాటిని ధైర్యంగా చూడట్లేదని తెలుస్తోంది. సెక్స్ విజ్ఞానం కలిగి ఉండటం వల్ల రతి సమయంలో ఎటువంటి పద్ధతులను అవలంభించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నవి తెలుసుకోవచ్చు. ఇక పెళ్లి కాకుండానే అమ్మాయి సెక్స్ పుస్తకాలు చదవడాన్ని సీరియస్ గా తీసుకునే కంటే ఆ వయసు వచ్చిన పిల్లలతో పరోక్షంగానైనా విషయాన్ని మెల్లగా అర్థమయ్యేట్లు చెప్పాలి. అలాంటపుడు వారు దాని గురించి అవగాహన పెంచుకుని వక్రమార్గాల్లో వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది.