శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 22 జూన్ 2015 (17:09 IST)

సెక్స్ కోర్కెలతో తల్లడిల్లిపోతున్నా.. ఆమెకు చీమకుట్టినట్టైనా లేదు ఏం చేయాలి?

నాకు వివాహమై మూడేళ్లు అయింది. పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకున్నా. అయితే, వివాహమైనప్పటి నుంచి నాకు శృంగార సమస్య ఎక్కువైంది. పెళ్లికాకముందు... శరీరంలో కామకోర్కెలు కలిగినపుడు హస్తప్రయోగంతో స్వయంతృప్తి పొందేవాడిని. కానీ, వివాహమైన తర్వాత కూడా నాకు ఈ పరిస్థితే ఎదురవుతుందని ఊహించలేకపోయా. ఎందుకంటే.. నా భార్య పడక గదిలో ఏమాత్రం సహకరించడం లేదు. దీంతో నేను సెక్స్ కోర్కెలతో తల్లడిల్లిపోతున్నా. దీంతో చేసేదిలేక రోజుమార్చిరోజు హస్తప్రయోగం చేసుకుంటున్నా. ఆమెకు మాత్రం చీమకుట్టినట్టైనా లేదు. యాభై యేళ్లు పైబడిన దంపతులు కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు విన్నాను. నా భార్యను సెక్స్ కోర్కెల వైపు మళ్లించేదెలా.?
 
 
ఆమెకు సెక్స్ అంటే ఎందుకు విముఖత ఏర్పడిందో తెలుసుకోండి. చాలామందికి స్త్రీలు సెక్స్ అంటే అదేదో నీచమైన కార్యంగా భావిస్తారు. చేయకూడని తప్పేదో చేస్తున్నామనే ఫీలింగ్ వారిలో ఉంటుంది. మరికొందరికి భావప్రాప్తి కలిగినపుడు యోనిలో ద్రవాలు ఊరడం, భర్త వీర్యస్ఖలనం చేయడాన్ని ఏవగింపుగా భావిస్తారు. మనస్సులో ఇలాంటి భావం ఉన్న మహిళలు ఇదేవిధంగా ప్రవర్తిస్తుంటారు.ఇంకొందరిలో అర్థంలేని భయాలు, అనుమానాలు, అశాస్త్రీయమైన ఆలోచనలు ఉంటాయి. అందువల్ల కూడా సెక్స్ అంటే ఇష్టపడరు. అందువల్ల ఆమెలో నిగూఢమైన జడత్వాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం అవసరమైతే సెక్స్ నిపుణుల వద్ద కౌన్సెలింగ్ ఇప్పించండి.