గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 నవంబరు 2014 (22:12 IST)

నాకు సెక్స్ కోర్కెలు లేవు... ఆయనకు సుఖం దక్కడం లేదు.. ఎలా?

చాలామంది యువతులు పలు వింత సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి శృంగారంపై ఏమాత్రం ఇష్టం లేకపోవడం. పెళ్లికి ముందే కాకుండా.. వివాహమైన తర్వాత కూడా ఈ సమస్య ఉంటుంది. దీంతో అటు కట్టుకున్న భర్తకు సంతోషం ఇవ్వలేక.. ఇటు తాను దాంపత్య సుఖం అనుభవించలేక నరకయాతన అనుభవిస్తుంటారు. దీంతో సెక్స్‌ కోర్కెలు కలిగేందుకు పలు రకాల మందుల కోసం ఆస్పత్రులకు వెళుతుంటారు. 
 
ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే.. చిన్నతనం నుంచి సెక్స్ కోర్కెలు ఏమాత్రం లేకపోవడం వల్లే ఇలాంటి వింత సమస్యలు ఎదురవుతుంటాయని వారు అంటున్నారు. పైపెచ్చు.. బాల్యం నుంచి పెరిగిన వాతావరణ పరిస్థితులు సెక్స్‌ పట్ల విముఖతకు కారణం కావొచ్చని చెపుతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. సెక్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. 
 
లైంగికత అనగానే అదేదో తప్పు అనే భావన మనస్సులో ఉంటే తక్షణం తొలగించేసుకోవాలని కోరుతున్నారు. చెడు పనిచేస్తున్నామనే ఆలోచన, ఇది తప్పు అనే విధానం వల్లే ఇలాంటి వింత సమస్య ఉత్పన్నమవుతుందని చెపుతున్నారు.