గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 25 ఫిబ్రవరి 2017 (22:13 IST)

శృంగారం లేకుండా మనిషి జీవించలేడా...?

సెక్స్‌ మనిషికి అవసరమా? కాదా? సెక్స్‌ లేకుండా మనిషి జీవించ లేడా? అంటే జవాబు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. సెక్సాలజీ మనిషిని పూర్తిగా, అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించాలని చెబుతుంది. మనిషి, శరీరం, హార్మోనులు, పుట్టి పెరిగిన పరిస్థితులు, సామాజిక వి

సెక్స్‌ మనిషికి అవసరమా? కాదా? సెక్స్‌ లేకుండా మనిషి జీవించ లేడా? అంటే జవాబు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. సెక్సాలజీ మనిషిని పూర్తిగా, అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించాలని చెబుతుంది. మనిషి, శరీరం, హార్మోనులు, పుట్టి పెరిగిన పరిస్థితులు, సామాజిక విలువలు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ఆశయాలు వీటన్నింటిని చూడాల్సి అవసరం ఎంతైనా ఉందని అంటోంది. 
 
అలాగే, సెక్స్‌లో పాల్గోవాలంటే పార్ట్‌నర్‌ ఇష్టా ఇష్టాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. తమకిష్టమైనవి, లేనివి స్త్రీ తన నోటితో చెప్పలేకపోవచ్చు. అలాంటివి ఫోర్‌ప్లేలో, రతిలో ఏమేం చేస్తుంటే ఉద్రేకం కలుగుతుంది. ఎక్కడ చేయి వేస్తే తీసి వేస్తున్నారు... ఎక్కడ చేయి ఉంచుకుంటున్నారు... ఇలాంటివి పరిశీలన ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. 
 
గర్భం వద్దనుకున్నపుడు వివిధ గర్భనిరోధక పద్దతులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి ముందుగా తెలుసుకోవాలి. లేకపోతే మనస్సులో గర్భం వస్తుందేమో అన్న భయం ఉంటే ఇద్దరూ శృంగారంలో సరిగా పాల్గొనలేకపోవచ్చును. 
 
సెక్స్‌లో కొన్ని వాతంటవే కలిగినా కొన్ని నేర్చుకోవాల్సి వుంటుంది. అంగస్తంభనాలు గర్భస్థ పిండానికి కూడా వాటంతటవే కలుగుతాయి. సెక్స్‌లో తృప్తి పొందడం, వీర్యస్ఖలనంపై నియంత్రణ, భావప్రాప్తి పొందడం ఇవి నేర్చుకోవాలి. శృంగారంలో తృప్తినిచ్చే వాటిలో పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమే. వాత్సాయనుడు వ్యక్తిగత పరిశుభ్రత, చక్కని పరిసరాలు, సుఖంగా వుండే బెడ్‌రూమ్‌కు ప్రాధాన్యతనిచ్చాడు. 
 
రతి క్రీడలో వస్త్రాలు లేకుండా ఒకరి శరీరాన్ని ఒకరు సాధ్యమైనంతసేపు ప్రేరేపించి అప్పుడు సెక్స్‌లో పాల్గొనాలి. ఫోర్‌ప్లే స్త్రీ పురుషునికి కూడా చేయాలి. ఒంట్లో బాగుండనపుడు, మానసికంగా ఆందోళన లేదా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొన లేకపోవచ్చు. అలాంటప్పుడు పార్ట్‌నర్‌ ప్రేమానురాగాలు చూపడం ద్వారా ఆరోగ్యం తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అందుకే సెక్స్ మనిషి దైనందన జీవితంలో ఓ భాగమని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.