బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (20:21 IST)

సెక్స్ అనగానే పురుషుడు లైట్ ఆఫ్ చేస్తాడు ఎందుకని...?

చాలామంది పురుషులు సెక్సులో పాల్గొనే సమయంలో గదిలో ఉన్న లైట్లన్నిటినీ ఆఫ్ చేసి చీకటి చేసేస్తుంటారు ఎందుకని...? దీనికి కారణం ఎక్కువమంది తమ శరీర దారుఢ్యాన్ని చూసి తన భాగస్వామి గేలి చేస్తుందనే అపోహలో ఉంటారని అంటుంటారు. కొందరైతే తమ పురుషాంగపు పొడవును చూసి భాగస్వామి కామెంట్లు చేస్తుందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.
 
దీనిపై ఇటీవల లండన్ లో సర్వే నిర్వహించగా సర్వేలో పాల్గొన్న వారిలో 25 శాతం తమ శరీర ఆకృతులను చూసి తన భాగస్వామి నవ్వుకుంటుందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట. మరికొంతమంది అయితే తమ ఉదర భాగం, బానపొట్టతో ఉంటే ఆమె సెక్స్ పరంగా ఉద్రిక్తత చెందకపోగా కామెంట్ చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికబరువు కూడా తమ సెక్స్ సమయంలో అడ్డుగా ఉంటుందనే ఆలోచనలో కొందరున్నట్లు తేలింది. అందువల్ల బెడ్రూంలో లైట్లు ఆర్పేసి సెక్స్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట.