బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:57 IST)

నా భర్తకు శీఘ్రస్ఖలన సమస్య.. ఎక్కువ టైం సెక్స్ చేసేలా మందులేమైనా ఉన్నాయా?

నా వయస్సు 25 యేళ్లు. వివాహమైంది. నా భర్తకు పెళ్లికి ముందు నుంచే శీఘ్రస్ఖలన సమస్య ఉందట. హస్త ప్రయోగం చేసుకునే సమయంలో కేవలం రెండు మూడు నిమిషాల్లో వీర్య స్ఖలనమయ్యేదట. ఇపుడు వివాహమైన తర్వాత కూడా సెక్స్ చేస్తుంటే ఇదేవిధంగా శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నాడు. దీనివల్ల మేమిద్దరం దాంపత్య సుఖం పొందలేక పోతున్నాం. అప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేటపుడు పాపులర్ బ్రాండ్ ఎక్స్‌ట్రా కండోమ్‌లనే వాడుతున్నాం. అయినా ఫలితం దక్కడం లేదు. ఎక్కవ సమయం పాటు సెక్స్ చేసేలా.. శీఘ్రస్ఖలనం కాకుండా ఉండేందుకు మందులేమైనా ఉన్నాయా. తెలియజేయండి. 
 
శీఘ్రస్ఖలన సమస్యకు పాపులర్ బ్రాండ్ ఎక్స్‌ట్రా టైమ్ కండోమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. వీటివల్ల ఉపయోగం కూడా లేదు. తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకే కండోమ్ ఉత్పత్తి కంపెనీలు ఆ విధమైన పేర్లు పెడుతుంటాయి. అయితే, శీఘ్రస్ఖలన సమస్య నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొందాలంటే వైద్యులను సంప్రదించి, వారు చెప్పినట్టుగా కొన్ని రకాల మెళకువలు, టెక్నిక్స్ పాటిస్తూ‌, వ్యాయామాలు చేసినట్టయితే ఈ సమస్యను అధికమించవచ్చు. 
 
అదేసమయంలో మార్కెట్‌లో అనేక రకాలైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని వైద్యుల సూచన మేరకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అనేక రకాలైన దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకానీ, వైద్యుల సలహా తీసుకోకుండా ఈ మందులను వాడినట్టయితే, లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.