శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (15:45 IST)

యోని రంధ్రం చిన్నదట... వేజ్‌లైన్‌ని లుబ్రికెంట్‌గా వాడమంటోంది.. మంచిదేనా?

మాది వైజాగ్. ఇటీవలే వివాహం చేసుకున్నా. పడక గదిలో నా భార్య సెక్స్ అంటేనే భయపడుతోంది. ముఖ్యంగా శోభనం రోజున నా అంగం సైజు చూసినప్పటి నుంచి... అంగ ప్రవేశానికి సుతరామా ఇష్టపడటం లేదు. అంగం సైజు పెద్దగా ఉంది... యోని రంధ్రం చిన్నదిగా ఉందని.. అందులోకి అంగం వెళ్లదని వాదిస్తోంది. బలవంతంగా అంగ ప్రవేశం చేస్తే నొప్పిని భరించలేనని ప్రాధేయపడుతోంది. దీంతో ఆమెను ఫోర్స్ చేసి సెక్స్‌కు ఒప్పించలేక పోతున్నా. కానీ నా భార్య ఫ్రెండ్ ఏదో సలహా ఇచ్చిందట. అదేంటంటే.. సెక్స్‌లో పాల్గొనే ముందు వేజ్‌లైన్ లేదా బేబీ ఆయిల్‌ని లూబ్రికెంట్‌గా వాడమని చెప్పిందట. వాటిని వాడటం వల్ల యోనికి, అంగానికి ఎలాంటి హాని జరగదు కదా? సలహాఇవ్వండి? 
 
చాలా మంది యువతులు ఇలాంటి భయంతో భర్తతో శృంగారానికి ససేమిరా అంటుంటారు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి తమ పండంటి సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చిన్న సమస్యను పెద్ద సమస్యగా చూడటమే దీనికంతటికీ కారణం. తొలి సారి సెక్స్‌లో పాల్గొనే యువతులకు మాత్రమే అంగ ప్రవేశ సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా సర్దుకుని పోతుంది. ఇక్కడ అంగం సైజుతో పని లేకుండా సెక్స్ సమయంలో యోని కండరాలు వ్యాకోచిస్తుంటాయి. అప్పటికీ భయంగా ఉన్నట్టయితే, కొబ్బరి నూనె లేదా కేవై జెల్లీ, వాటర్ సాల్యుబుల్ జెల్లీ వంటివి వాడుకోవచ్చు.