గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PYR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (15:06 IST)

శనివారం సాయంత్రం... 7.33 గంటలకు సెక్సులో పాల్గొంటే... ఆహా..!!

రాహుకాలం, యమగండం, శుభగడియలు, నక్షత్రాలు చూసుకుని సెక్సులో కూడా పాల్గొనే వారుంటారా... అవుననే చెబుతున్నాయి కొన్ని సర్వేలు. ఇది ఇలా ఉంటే మన శాస్త్రాలు శోభనం పేరుతో ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాయి. సెక్సుకు కూడా సమయం ఉంటుందని అప్పుడే రతి క్రీడ ఆసక్తిగా ఉంటుందనీ, అప్పుడే సంతాన ప్రాప్తి కలుగుతుందనేదే శోభనం ముహుర్తంలోని పరమార్థం. అయితే ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలు సర్వే నిర్వహించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సెక్సుకు కూడా ఓ సమయం ఉందని ఆ సమయంలో మాత్రమే చాలా జంటలు సెక్సులో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతాయని తేల్చాయి. 
 
రతిలో పాల్గొనే జంటలు సమయం చూసుకుంటాయని తెలుస్తోంది. సెక్స్ టాయ్ కంపెనీ లవ్ హనీలు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సెక్సులో పాల్గొనే జంట వివిధ నిర్ధిష్ట సమయాలను ఎన్నుకుంటున్నట్లు తేలింది. ఆ సంస్థ 3 వేల మందిని సర్వేకు ఎంపిక చేసుకుంది. ఈ సర్వేలో శనివారం సాయంత్రం 7 గంటల 37 నిమిషాలకు రతిక్రీడ జరపడానికి చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది.  
 
వారిలో 44 శాతం మంది శనివారంనాడే రతిక్రీడకు ఎక్కువ ఇష్టపడినట్లు తేలింది. ఆదివారం నాడు 24 శాతం మంది, శుక్రవారంనాడు 22 శాతం మంది రతిక్రీడకు ఆసక్తి చూపినట్లు తేలింది. నిద్ర లేచే సమయంలో పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు సాయంత్రం 4 గంటల 33 నిమిషాలకు ఆ కోరిక పుడుతుందని సర్వేలో తేలింది. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి.