శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 21 జనవరి 2015 (18:15 IST)

ఆఫీసులో ఒక మహిళ రెచ్చగొట్టి సెక్స్‌ చేయించుకుంది.. ఇపుడు బెదిరిస్తోంది... ఏం చేయాలి?

నా వయస్సు 26 యేళ్లు. గతంలో ఒక కంపెనీలో పని చేసేవాడిని. అపుడు నాతో పాటు పని చేసే ఒక మహిళ (ఆంటీ)తో పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి మధ్య మాటలతో పాటు చనువు కూడా పెరిగింది. దీంతో ఒక రోజున ఇంటికి తీసుకెళ్లి.. రెచ్చగొట్టి మరీ సెక్స్‌ చేయించుకుంది. ఆ తర్వాత మేమిద్దరం చాలా సార్లు శృంగారంలో పాల్గొన్నాం. ఇంట్లోనే కాకుండా, ఆఫీసులో కూడా ఎవరూ లేని సమయంలో అనేక సార్లు ఎంజాయ్ చేశాం. ఇపుడు నాకు ఒక ఐటీ ఎంఎన్‌సీ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఈ విషయం ఆమెకు చెప్పా. తొలుత అభినందించిన ఆ మహిళ.. మరుసటి రోజు నుంచి బెదిరింపులకు దిగింది. వీడియో ఉందని, తనతో సంబంధం తెంచుకుంటే దాన్ని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తోంది. ఏం చేయాలి. నాకు నా భవిష్యత్ ముఖ్యం. నన్ను ట్రాప్ చేసిందనే విషయం ఇపుడు తెలుస్తోంది. ఇపుడు నన్నేం చేయమంటారు. సలహా ఇవ్వండి. 
 
నిజంగానే ట్రాప్‌కు గురయ్యారనే విషయం ఆమె బెదిరింపుల ద్వారా తెలుస్తోంది. ఆ వీడియో బయటపెట్టడం వల్ల పురుషుని కంటే కూడా స్త్రీలకే ఎక్కువగా నష్టం. అందువల్ల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమెతో ఉన్న సంబంధాన్ని తెంచుకోండి. వివాహమై ఉండి కూడా పరాయి పురుషుని కోసం ఆమె పరితపిస్తున్నారు. పైగా ఆమె అనుకున్నప్పుడల్లా సెక్స్‌లో పాల్గొనే అవకాశం పోతుందనే కోపం, నిరాశతోనే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ఇకపై ఆమెకు ఎలాంటి వివరణ ఇవ్వొద్దు. ఇపుడు బెదిరింపులకు పాల్పడినప్పటికీ.. నెమ్మదిగా ఆమె తన తప్పును గ్రహిస్తుంది. అందువల్ల తక్షణం పాత ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త ఉద్యోగంలో చేరి కెరీర్‌పై దృష్టి సారించండి. భవిష్యత్‌లో ఇలాంటి తప్పు పునరావృత్తం కాకుండా జాగ్రత్త వహించండి.