శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2014 (13:17 IST)

నా వక్షోజాలు చిన్నవి...! ఆయన ఫీలవుతున్నారు..! ఏం చేయను..?

సాధారణంగా నా వక్షోజాలు చిన్నవి. పెళ్ళయిన తర్వాత మొదటి బాబు పుట్టాక వక్షోజాలు వాటంతట అవే పెద్దవై బాబుకు కావలసినన్న పాలు వచ్చాయి. పాలు తాగడం ఆపి వేయగానే మళ్లీ చిన్నవిగా అయ్యాయి.
 
రెండో బాబు పుట్టాక కూడా అదే విధంగా వాటతంట అవే పెరిగి, పాలు మానగానే ఎప్పటిలానే మళ్లీ చిన్నవి అవుతున్నాయి. దీంతో నా భర్త ఫీలవుతున్నారు. అవి పెద్దవిగానే ఉంటే బాగుంటుందని మా వారి కోరిక. అందునేనేంచెయ్యాలి.
 
 
స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ వారిలో తయారయ్యే హార్మోన్ల వల్ల వక్షోజాల సైజు పెరుగుతుంది. రజస్వల కాక ముందు చిన్నవిగా ఉండే వక్షోజాలు, రజస్వల అయ్యాక జననేంద్రియాల పెరుగుదలతో పాటు వక్షోజాల పరిమాణం కూడా పెరుగుతుంది. 
 
ఆ తర్వాత ప్రెగ్రెన్సీ సమయంలో, డెలివరీ అయ్యాక, బిడ్డకు పాలిచ్చే కాలంలో వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. వక్షోజాలలో పాలను తయారు చేసే గ్రంథులు, కొవ్వు, ఫైబర్ టిష్యూ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 
 
వక్షోజాల పైన ఉండే నిపుల్స్‌లో సున్నితమైన కండరాలు ఉంటాయి. సెక్స్ కోరిక కలిగినపుడు, పాలిచ్చేటప్పుడు నిపుల్స్ ఉబ్బుతాయి. అలాగే వక్షోజాలు కూడా కొంత పరిమాణం పెరగడం అనేది అతి సహజం.
 
బిడ్డకు పాలు ఇవ్వడం మానగానే క్షీర గ్రంథుల ఉత్పత్త తగ్గిపోవడంతో వాటి పరిమాణం కూడా తగ్గిపోతుంది. వక్షోజాల పరిమాణం తగ్గకుండా ఉండాలంటే బలవర్థకమైన ఆహారం తీసుకోవడంతోపాటు, చిన్నపాటి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తద్వారా వక్షోజాలను కొంత మేర పెంచి బిగుతుగా తయారు అయ్యేందుకు దోహదపడతాయి.