శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (18:56 IST)

వక్ష ద్వయం వృద్ధికి సహజ సిద్ధమైన పద్ధలేంటి?

అనేక మంది యువతులను ఒక ప్రధాన సమస్య పట్టిపీడిస్తుంటుంది. ముఖ్యంగా యుక్త వయస్సుకు వచ్చిన యువతుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే.. పలువురు యువతుల వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని పెద్దవి చేసుకునేందుకు వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా.. అనేక నాటు వైద్యాలు సైతం చేస్తుంటారు. 
 
అయితే, వైద్యులు మాత్రం ఈ స్తన ద్వయ సంపదను మరింతగా పెంచుకునేందుకు కొన్ని సహజ సిద్ధమైన పద్దతులను అవలంభిస్తే సరిపోతుందని చెపుతున్నారు. సాధారణంగా చిన్న సైజు వక్షోజాలు కలిగిన మహిళలు వాటిని పెద్దవి చేసుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ వంటి వాటికి దూరంగా ఉండాలని వారు సూచన చేస్తున్నారు. 
 
సహజసిద్ధమైన విధానం ద్వారా ఎద సంపదను రెట్టింపు చేసుకోవచ్చని రుజువైనప్పటికీ.. ఈ విధానాలను పాటించడం ద్వారా మార్పు రాత్రికి రాత్రి కనిపించదని, కొన్ని నెలల సమయం పడుతుందని వారు అంటున్నారు. ప్రకృతి వనమూలికలతో తయారు చేసిన మూలికా మందులను వాడటం ఒక విధానమంటున్నారు. ఈ మూలికలను వినియోగించడం వల్ల రెండు మూడు నెలల్లో మంచి ఫలితం లభిస్తుందని వారు చెపుతున్నారు. 
 
అలాగే, ఇంగ్లీష్ వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని రకాల లోషన్‌లను ఎదబాగాలపై రాసి మసాజ్ చేసుకుంటే మార్పు కొద్ది రోజుల్లోనే కనబడుతుందని వారు చెపుతున్నారు. వీటన్నింటి కంటే ప్రధానంగా సహజమైన వ్యాయామం ద్వారా రొమ్ము సైజులను పెంచుకోవచ్చని వారు చెపుతున్నారు.